Aligidinaa needo avumgaadani yamtinaa

అలిగితినా నీతో అవుఁగాదని యంటినా
Language

(॥పల్లవి॥)
అలిగితినా నీతో అవుఁగాదని యంటినా
తలఁపులో నున్నాఁడవు దయఁజూడరా

(॥ఇందు॥)
ఆనలేల పెట్టేవు ఆసలేల రేచేవు
మోనమున నున్నదాన ముద్దరాలనే
కానీలేరా నావంటి కాంతలు నీకుఁ గలరు
దానికేమి అట్లానేదయ చూడరా

(॥ఇందు॥)
చెక్కులేల నొక్కేవు సిగ్గులేల పుట్టించేవు
ఇక్కడనే వున్నదాన హితురాలనే
దిక్కులను మరి నీవు తెచ్చుకొంటి వింతులను
తక్కక నన్నట్లానే దయచూడరా

(॥ఇందు॥)
యేల కాగిలించేవు యెంత వొడబరచేవు
యీలాగుల నున్నదాన యిల్లాలనై
అలరి శ్రీవేంకటేశ ఆడ్లఁ బెండ్లాడితివి
తాలిమి నన్నట్లానే దయచూడరా

(||pallavi||)
aligidinā nīdo avum̐gādani yaṁṭinā
talam̐pulo nunnām̐ḍavu dayam̐jūḍarā

(||iṁdu||)
ānalela pĕṭṭevu āsalela resevu
monamuna nunnadāna muddarālane
kānīlerā nāvaṁṭi kāṁtalu nīgum̐ galaru
dānigemi aṭlānedaya sūḍarā

(||iṁdu||)
sĕkkulela nŏkkevu siggulela puṭṭiṁchevu
ikkaḍane vunnadāna hidurālane
dikkulanu mari nīvu tĕchchugŏṁṭi viṁtulanu
takkaga nannaṭlāne dayasūḍarā

(||iṁdu||)
yela kāgiliṁchevu yĕṁta vŏḍabarasevu
yīlāgula nunnadāna yillālanai
alari śhrīveṁkaḍeśha āḍlam̐ bĕṁḍlāḍidivi
tālimi nannaṭlāne dayasūḍarā