Aligaavaa sitti silagaa digavaa nelavamka

అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక
Year
Language

పల్లవి:

అలిగావా చిట్టి చిలకా దిగవా నేలవంక
అడిగేశా ఉండలేక చాల్లే బెట్టు చేయక

ఔననుకో గోరువంకా అలుసిచ్చాను గనుక
జరిగిందే తెలుసుకోక నాపై నిందలేయక
నీకేమి ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక... ఆ...

చరణం 1:

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవైనట్టు ఉంది
నా నుంచి నేనే వేరైనట్టు ఉంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేంకాను మాటకాలేను ఏమిటౌతున్నది ?

చరణం 2:

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింక ఉన్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నాను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూశాను పంతమా ఆగవే... !

pallavi:

aligāvā siṭṭi silagā digavā nelavaṁka
aḍigeśhā uṁḍalega sālle bĕṭṭu seyaga

aunanugo goruvaṁkā alusichchānu ganuga
jarigiṁde tĕlusugoga nābai niṁdaleyaga
nīgemi ūsuboga nāde neramanaga
nijamaṁte vādiṁchaga... ā...

saraṇaṁ 1:

o kannu mūsi sūstunnaṭṭu uṁdi
nā ŏṁṭi naḍaga nāge nachchaguṁdi
nādone nāgu gŏḍavainaṭṭu uṁdi
nā nuṁchi nene verainaṭṭu uṁdi
ūrugolenu serugolenu manasilā ĕṁduguṁdi
mūganeṁkānu māḍagālenu emiḍaudunnadi ?

saraṇaṁ 2:

nādoḍa puvve nābai kobamaṁṭe
ī prāṇamiṁka unnā lenidaṁte
nāloni sagame nāge dūramuṁṭe
e saṁdaḍainā manase navvadaṁte
silibi jagaḍānni pĕṁchugunnānu nestamā tappu nāde
sĕlimi virahāna sedu sūśhānu paṁtamā āgave... !