Alayigeramgavaddaa aamtadaani yedalanu

అలయికెరఁగవద్దా ఆఁటదాని యెడలను
Language

(॥పల్లవి॥)
అలయికెరఁగవద్దా ఆఁటదాని యెడలను
యెలుఁగెత్తి తిట్టితేను యేమి సేసే విఁకను

(॥అల॥)
మొక్కి మొక్కి చేతులెత్తి ముదిత వొడ్డించుకోఁగా
కక్కసించి చెనకేవు కాతరానను
జక్కవలఁ బోలిన మునుముక్కులు
ఇక్కడ నిన్ను నాటితే నేమిసేసేవిఁకను

(॥అల॥)
చుట్టి చుట్టి పాదాలపై సుదతి యానవెట్టఁగా
ఱట్టుగాఁ గాఁగిలించే వాఱడిగా నీవు
దిట్టలయిన చకోరాల తీరుల కన్నుల చూపు
లిట్టె నిన్ను సొలసితే నేమి సే సేవిఁకను

(॥అల॥)
మళ్లి మళ్లి రతులను మగువ నిన్నుఁ గూడఁగా
పల్లదాన నవ్వేవు పచ్చిదేరను
మెల్లనె వజ్రాలవంటి మెరుఁగు గోరు లంటితే
యెల్లగా శ్రీ వేంకటేశ యేమి సేసే విఁకను

(||pallavi||)
alayigĕram̐gavaddā ām̐ṭadāni yĕḍalanu
yĕlum̐gĕtti tiṭṭidenu yemi sese vim̐kanu

(||ala||)
mŏkki mŏkki sedulĕtti mudida vŏḍḍiṁchugom̐gā
kakkasiṁchi sĕnagevu kādarānanu
jakkavalam̐ bolina munumukkulu
ikkaḍa ninnu nāḍide nemisesevim̐kanu

(||ala||)
suṭṭi suṭṭi pādālabai sudadi yānavĕṭṭam̐gā
ṟaṭṭugām̐ gām̐giliṁche vāṟaḍigā nīvu
diṭṭalayina sagorāla tīrula kannula sūbu
liṭṭĕ ninnu sŏlaside nemi se sevim̐kanu

(||ala||)
maḽli maḽli radulanu maguva ninnum̐ gūḍam̐gā
palladāna navvevu pachchideranu
mĕllanĕ vajrālavaṁṭi mĕrum̐gu goru laṁṭide
yĕllagā śhrī veṁkaḍeśha yemi sese vim̐kanu