అలయకువే నీవు ఆతనిఁ దోడి తెచ్చితి
(॥పల్లవి॥)
అలయకువే నీవు ఆతనిఁ దోడి తెచ్చితి
యెలమితో మీరిద్దరూ నెన్నఁడూ బాయకురే
(॥అల॥)
విరహ మేమిసేసీనే విభుఁడు నీవాఁడైతే
యిరవైన నీకోరిక లేడేరీఁగాక
మరుఁ డేమిసేసినే మనసు పదిలమైతే
పెరరేఁచి మిమ్మిద్దరి బెండ్లి సేసీఁగాక
(॥అల॥)
అలు లేమిసేసీనే ఆయములు గరఁగితే
కొలికికిఁ దెచ్చి రతిఁ గూరిచీఁగాక
వల పేమిసేసీనే వద్దఁ బాయకుండితేను
తలకొన్న సంతోసాల దగిలించీఁగాక
(॥అల॥)
చింత యేమిసేసీనే శ్రీవేంకటేశుఁ గూడితే
దొంతర వేడుకలెల్లా దొరకీఁగాక
మంతన మేమిసేసీనే మచ్చికలఁ బెనఁగితే
చెంత చెమటలు రేఁగి చిప్పిలేఁగాక
(||pallavi||)
alayaguve nīvu ādanim̐ doḍi tĕchchidi
yĕlamido mīriddarū nĕnnam̐ḍū bāyagure
(||ala||)
viraha memisesīne vibhum̐ḍu nīvām̐ḍaide
yiravaina nīgoriga leḍerīm̐gāga
marum̐ ḍemisesine manasu padilamaide
pĕrarem̐si mimmiddari bĕṁḍli sesīm̐gāga
(||ala||)
alu lemisesīne āyamulu garam̐gide
kŏligikim̐ dĕchchi radim̐ gūrisīm̐gāga
vala pemisesīne vaddam̐ bāyaguṁḍidenu
talagŏnna saṁtosāla dagiliṁchīm̐gāga
(||ala||)
siṁta yemisesīne śhrīveṁkaḍeśhum̐ gūḍide
dŏṁtara veḍugalĕllā dŏragīm̐gāga
maṁtana memisesīne machchigalam̐ bĕnam̐gide
sĕṁta sĕmaḍalu rem̐gi sippilem̐gāga