అలమేల్మంగనే నేను ఆకె నెటువంట(టి?)దో
(॥పల్లవి॥)
అలమేల్మంగనే నేను ఆకె నెటువంట(టి?)దో
యెలుఁగెత్తి చెప్పవయ్యా యియ్యకొనే నేను
(॥అల॥)
మంతనము లాడెనట మగువ యెవ్వతొ నీతో
చెంతనుండి సన్నలూనుఁ జేసెనట
యింతులెల్లాఁ జెప్పుకొనే రీ సుద్దలే వాడలోన
యెంతటిదో చూపవయ్య యెరిఁగేను నేను
(॥అల॥)
చెట్టవట్టి తీసెనంట చెలి నీ చెక్కులు నొక్కి
గుట్టుతోడ నిన్ను వేఁడుకొనియనట
బట్టబయలాయను యీ పనులెల్లా నూరిలోను
అట్టిదానిఁ జూపవయ్య అడిగేను నేను
(॥అల॥)
గంటిసేసెనట మోవి కాఁగిలించుకొని నిన్ను
వొంటిదే నీ పాదాలు నొత్తెనట
నంటున శ్రీవేంకటేశ నన్ను నిట్టె యేలితివి
దంటదానిఁ జూపవయ్య తగమెచ్చే నేను
(||pallavi||)
alamelmaṁgane nenu āgĕ nĕḍuvaṁṭa(ṭi?)do
yĕlum̐gĕtti sĕppavayyā yiyyagŏne nenu
(||ala||)
maṁtanamu lāḍĕnaḍa maguva yĕvvadŏ nīdo
sĕṁtanuṁḍi sannalūnum̐ jesĕnaḍa
yiṁtulĕllām̐ jĕppugŏne rī suddale vāḍalona
yĕṁtaḍido sūbavayya yĕrim̐genu nenu
(||ala||)
sĕṭṭavaṭṭi tīsĕnaṁṭa sĕli nī sĕkkulu nŏkki
guṭṭudoḍa ninnu vem̐ḍugŏniyanaḍa
baṭṭabayalāyanu yī panulĕllā nūrilonu
aṭṭidānim̐ jūbavayya aḍigenu nenu
(||ala||)
gaṁṭisesĕnaḍa movi kām̐giliṁchugŏni ninnu
vŏṁṭide nī pādālu nŏttĕnaḍa
naṁṭuna śhrīveṁkaḍeśha nannu niṭṭĕ yelidivi
daṁṭadānim̐ jūbavayya tagamĕchche nenu