Alai pomgeraa kannaa

అలై పొంగెరా కన్నా
Work
Year
Language

పల్లవి:

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా
మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా... ఆ... ఆ... ఆ...

చరణం 1:

నిలబడి వింటూనే చిత్తరువైనాను || 2 ||

కాలమాగినది రా దొర
ప్రాయమున యమున మురళీధర
యవ్వనమలై పొంగెరా కన్నా... ఆ...

కనుల వెన్నెల పట్టపగల్ పాల్చిలుకగా
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగె
(కాదిలి వేణుగానం కానడ పలికే ) || 2 ||

కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే

చరణం 2:

అనంతమనాది వసంత పదాల
సరాగసరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద
మెడారి గళాన వర్షించవా

ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా

చరణం 3:

కడలికి అలలకు కధకళి కళలిడు
శశికిరణమువలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు
రవికిరణాలే రచించవా

కవిత మదిని రగిలే ఆవేదనో
ఇతర భామలకు లేని వేదనో || 2 ||

ఇది తగులో ఎద తగవో
ఇది ధర్మం ఔనో || 2 ||

కొసరి ఊదు వేణువున
వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా కన్నా ఆ... ఆ... ఆ...

pallavi:

alai pŏṁgĕrā kannā
mānasamalai pŏṁgĕrā
ānaṁda mohana veṇugānamuna
ālābane kannā
mānasamalai pŏṁgĕrā
nī navarasa mohana veṇugānamadi
alai pŏṁgĕrā kannā... ā... ā... ā...

saraṇaṁ 1:

nilabaḍi viṁṭūne sittaruvainānu || 2 ||

kālamāginadi rā dŏra
prāyamuna yamuna muraḽīdhara
yavvanamalai pŏṁgĕrā kannā... ā...

kanula vĕnnĕla paṭṭabagal pālsilugagā
kaluva regula maṁchu mutyālu vĕlige
kannĕ momuna kanubŏmmalaḍu pŏṁgĕ
(kādili veṇugānaṁ kānaḍa palige ) || 2 ||

kannĕ vayasu kaḽalŏlige veḽalo
kannĕ sŏgasu ŏga vidhamai ŏrigĕle

saraṇaṁ 2:

anaṁtamanādi vasaṁta padāla
sarāgasarāla svarānivā
niśhāṁta mahīja śhaguṁtamaraṁda
mĕḍāri gaḽāna varṣhiṁchavā

ŏga sugaṁdha vanāna sukhāla kṣhaṇāna
variṁchi kaugiḽḽu bigiṁchavā
sugaṁdha vanāna sukhāla kṣhaṇāna
variṁchi kaugiḽḽu bigiṁchavā

saraṇaṁ 3:

kaḍaligi alalagu kadhagaḽi kaḽaliḍu
śhaśhigiraṇamuvalĕ saliṁchavā
siguru sŏgasulanu taliruḍāgulagu
ravigiraṇāle rasiṁchavā

kavida madini ragile āvedano
idara bhāmalagu leni vedano || 2 ||

idi tagulo ĕda tagavo
idi dharmaṁ auno || 2 ||

kŏsari ūdu veṇuvuna
valabule silugu
madhura gāyamidi geyamu palugagā

alai pŏṁgĕrā kannā
mānasamalai pŏṁgĕrā
nī ānaṁda mohana veṇugānamuna
ālābane kannā kannā ā... ā... ā...