అక్కచెల్లెండ్లము నేము ఆకె నాకు వింతగాదు
(॥పల్లవి॥)
అక్కచెల్లెండ్లము నేము ఆకె నాకు వింతగాదు
చక్కఁగా మాఁటలాడరే సంతోసించుకొంటాను
(॥అక్క॥)
చెప్పరే మీ రితనికి చెలియ సుద్దు లెల్లాను
విప్పుచుఁ జెవులు చల్లఁగా వినీఁగాక
యిప్పు డిట్టె నేనుండఁగా నేల దాఁచే రాపనులు
చొప్పుగా మొక మొకాలు చూచుకొంటాను
(॥అక్క॥)
మొక్కరే మీ రితనికి మోహపు దేవుల మారు
చొక్కుచుఁ గన్నులారాఁ జూచి యేల
యిక్కడ నన్నుఁ జూచి వూరకున్నవాఁడు
చెక్కుల చేతులతోడ చేరి నవ్వుకొంటాను
(॥అక్క॥)
యియ్యరే కానుక లాపె యిచ్చి పంపినవెల్లా
చెయ్యారా నందుకొని చెలఁగుఁగాని
యియ్యెడ శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నిట్టె
వొయ్యనే మీరేల లోఁగే రూహించుకొంటాను
(||pallavi||)
akkasĕllĕṁḍlamu nemu āgĕ nāgu viṁtagādu
sakkam̐gā mām̐ṭalāḍare saṁtosiṁchugŏṁṭānu
(||akka||)
sĕppare mī ridanigi sĕliya suddu lĕllānu
vippusum̐ jĕvulu sallam̐gā vinīm̐gāga
yippu ḍiṭṭĕ nenuṁḍam̐gā nela dām̐se rābanulu
sŏppugā mŏga mŏgālu sūsugŏṁṭānu
(||akka||)
mŏkkare mī ridanigi mohabu devula māru
sŏkkusum̐ gannulārām̐ jūsi yela
yikkaḍa nannum̐ jūsi vūragunnavām̐ḍu
sĕkkula seduladoḍa seri navvugŏṁṭānu
(||akka||)
yiyyare kānuga lābĕ yichchi paṁpinavĕllā
sĕyyārā naṁdugŏni sĕlam̐gum̐gāni
yiyyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu niṭṭĕ
vŏyyane mīrela lom̐ge rūhiṁchugŏṁṭānu