(॥పల్లవి॥)
అటువంటివారమే అందరము
తటుకన మమ్మునేల తగ వడిగేవు
(॥అటు॥)
సాదై యుండినయాపెను సవతులకని వెట్టి
సేదదేర్చి గయ్యాళిగఁ జేసితివి
సాదించి బొమ్మల నిన్ను జంకించక మానునా
దాదాత మమ్మునేల తగ వడిగేవు
(॥అటు॥)
యేనెపమోఱఁగనాపె నెగ్గులెంచ నేరిపి
నానాట నిందరికి మొనవెట్టితివి
నానఁబట్టినచూపుల సాదించవలదా నిన్ను
దానదకిఁగా మమ్మునేల తగ వడిగేవు
(॥అటు॥)
పీఁటపైఁ బెండ్లియాపెఁ బెద్దరికా లిచ్చి కూడి
మేఁటి కాంతలమాటలు మీరించితివి
గాఁటపు శ్రీవేంకటేశ కత గరచె నన్నిటా
తాటించి మమ్మేల యిఁకఁ దగ వడిగేవు
(||pallavi||)
aḍuvaṁṭivārame aṁdaramu
taḍugana mammunela taga vaḍigevu
(||aḍu||)
sādai yuṁḍinayābĕnu savadulagani vĕṭṭi
sedadersi gayyāḽigam̐ jesidivi
sādiṁchi bŏmmala ninnu jaṁkiṁchaga mānunā
dādāda mammunela taga vaḍigevu
(||aḍu||)
yenĕbamoṟam̐ganābĕ nĕggulĕṁcha neribi
nānāḍa niṁdarigi mŏnavĕṭṭidivi
nānam̐baṭṭinasūbula sādiṁchavaladā ninnu
dānadagim̐gā mammunela taga vaḍigevu
(||aḍu||)
pīm̐ṭabaim̐ bĕṁḍliyābĕm̐ bĕddarigā lichchi kūḍi
mem̐ṭi kāṁtalamāḍalu mīriṁchidivi
gām̐ṭabu śhrīveṁkaḍeśha kada garasĕ nanniḍā
tāḍiṁchi mammela yim̐kam̐ daga vaḍigevu