అటువంటిది గాకుంటే ఆఁటదందురా
(॥పల్లవి॥)
అటువంటిది గాకుంటే ఆఁటదందురా
సటలెల్లా నెరపీని చాటి చెప్పఁదగును
(॥అటు॥)
వుంద్దండపుమాట లాడి వువిద చన్నుల నొత్తి
అద్దుకొని నీ కిట్టె ప్రియాలు చెప్పీని
సుద్దు లెంతనేర్చునో సూటిగా నిన్నిట్లానే
తిద్దుకొనె కాఁగిటికి దేవులు గాఁదగును
(॥అటు॥)
కాతరించి వొడివట్టి కామిని లోనికిఁదీసి
చేత నిన్నాయము లంటి చెక్కు నొక్కిని
యేతు లెంతవేడుకో ఇటువలె నీముందర
ఆతుమగాఁ జెప్పి ఆకె నీకుఁదగును
(॥అటు॥)
సాదువలె నిన్నుఁ బిల్చిసతి మోవి గంటిసేసి
పాదాలకు మొక్కి నీకుఁ బంతమిచ్చీని
పోదితో శ్రీవేంకటేశ బూపతిచెరువుకాడ
ఆదిగొని నిన్నుఁ గూడె ఆకె నీకుఁ దగును
(||pallavi||)
aḍuvaṁṭidi gāguṁṭe ām̐ṭadaṁdurā
saḍalĕllā nĕrabīni sāḍi sĕppam̐dagunu
(||aḍu||)
vuṁddaṁḍabumāḍa lāḍi vuvida sannula nŏtti
addugŏni nī kiṭṭĕ priyālu sĕppīni
suddu lĕṁtanersuno sūḍigā ninniṭlāne
tiddugŏnĕ kām̐giḍigi devulu gām̐dagunu
(||aḍu||)
kādariṁchi vŏḍivaṭṭi kāmini lonigim̐dīsi
seda ninnāyamu laṁṭi sĕkku nŏkkini
yedu lĕṁtaveḍugo iḍuvalĕ nīmuṁdara
ādumagām̐ jĕppi āgĕ nīgum̐dagunu
(||aḍu||)
sāduvalĕ ninnum̐ bilsisadi movi gaṁṭisesi
pādālagu mŏkki nīgum̐ baṁtamichchīni
podido śhrīveṁkaḍeśha būbadisĕruvugāḍa
ādigŏni ninnum̐ gūḍĕ āgĕ nīgum̐ dagunu