Adugudaamani umdi ninnoga maada

అడుగుదామని ఉంది నిన్నొక మాట
Work
Year
Language

పల్లవి:

అదుగుదామని ఉంది నిన్నొక మాట.. పెదవి దాటి రాకున్నది నా నోట
తీయరాదా.. సిగ్గు పరదా.. ఎవరు లేరు కదా..ఆ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట.. పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే.. అంత ప్రేమ.. కలిగెనెందుకనీ..ఈ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట..

చరణం 1:

పసిదానిగ నటియించి.. మది దోచావెందులకు
నేనెవరో తెలియకనే.. నను పిలిచావెందులకు
ఇది ఏమి గడుసుతనం..
ఇది ఏమి చిలిపితనం..
కాదు పడుచుతనం..ఊఁ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట

చరణం 2:

మన పరిచయమొక కథగా.. జరిగింది మొదటి రోజు
ఆ పరిచయ ఫలితముగా.. పెరిగింది ప్రేమ మోజు
ఏనాటి అనుబంధమో..
గత జన్మలో బంధమో..
ఎందుకీ స్నేహమో..

అడుగుదామని ఉంది నిన్నొక మాట.. పెదవి దాటి రాకున్నది నా నోట
ఇంతలోనే అంత ప్రేమ.. కలిగెనెందుకనీ..ఈ..

అడుగుదామని ఉంది నిన్నొక మాట

pallavi:

adugudāmani uṁdi ninnŏga māḍa.. pĕdavi dāḍi rāgunnadi nā noḍa
tīyarādā.. siggu paradā.. ĕvaru leru kadā..ā..

aḍugudāmani uṁdi ninnŏga māḍa.. pĕdavi dāḍi rāgunnadi nā noḍa
iṁtalone.. aṁta prema.. kaligĕnĕṁduganī..ī..

aḍugudāmani uṁdi ninnŏga māḍa..

saraṇaṁ 1:

pasidāniga naḍiyiṁchi.. madi dosāvĕṁdulagu
nenĕvaro tĕliyagane.. nanu pilisāvĕṁdulagu
idi emi gaḍusudanaṁ..
idi emi silibidanaṁ..
kādu paḍusudanaṁ..ūm̐..

aḍugudāmani uṁdi ninnŏga māḍa

saraṇaṁ 2:

mana parisayamŏga kathagā.. jarigiṁdi mŏdaḍi roju
ā parisaya phalidamugā.. pĕrigiṁdi prema moju
enāḍi anubaṁdhamo..
gada janmalo baṁdhamo..
ĕṁdugī snehamo..

aḍugudāmani uṁdi ninnŏga māḍa.. pĕdavi dāḍi rāgunnadi nā noḍa
iṁtalone aṁta prema.. kaligĕnĕṁduganī..ī..

aḍugudāmani uṁdi ninnŏga māḍa