Adugave seliyaa aadani neevu

అడుగవే చెలియా ఆతని నీవు
Language

(॥పల్లవి॥)
అడుగవే చెలియా ఆతని నీవు
యెడయక తనతో నే నెగసక్కే లాడేనా

(॥అడు॥)
యెందుండి పచ్చితివంటే యేల తలవంచీనే
కందె నీమోవి యంటేను కతలేమి చెప్పీనే
గందము చిట్లెనంటే కడునేల జంకించీనే
చిందీఁ జెమటలంటేను సిగ్గువడ నేఁటికే

(॥అడు॥)
కొప్పు జారెనంటేను కొచ్టి యేల నవ్వీనే
వుప్పతిలీఁ గళలంటే వురిమి యేల చూచీనే
కప్పుకొ నీమేనంటే కందువలేల దాఁచీనే
దప్పి యెంత గొంటివంటే తలపోఁతలేఁటికే

(॥అడు॥)
వింతవాస లేడదంటే వినయాలేల సేసీనే
సంతోసించే వేమియంటే సారె వేఁడుకొనీనేలే
ఇంతసేసి శ్రీవేంకటేశుఁడు నిన్నిటు గూడె
చింత నీకెందున్నదంటే చెక్కునొక్క నేఁటికే

(||pallavi||)
aḍugave sĕliyā ādani nīvu
yĕḍayaga tanado ne nĕgasakke lāḍenā

(||aḍu||)
yĕṁduṁḍi pachchidivaṁṭe yela talavaṁchīne
kaṁdĕ nīmovi yaṁṭenu kadalemi sĕppīne
gaṁdamu siṭlĕnaṁṭe kaḍunela jaṁkiṁchīne
siṁdīm̐ jĕmaḍalaṁṭenu sigguvaḍa nem̐ṭige

(||aḍu||)
kŏppu jārĕnaṁṭenu kŏchṭi yela navvīne
vuppadilīm̐ gaḽalaṁṭe vurimi yela sūsīne
kappugŏ nīmenaṁṭe kaṁduvalela dām̐sīne
dappi yĕṁta gŏṁṭivaṁṭe talabom̐talem̐ṭige

(||aḍu||)
viṁtavāsa leḍadaṁṭe vinayālela sesīne
saṁtosiṁche vemiyaṁṭe sārĕ vem̐ḍugŏnīnele
iṁtasesi śhrīveṁkaḍeśhum̐ḍu ninniḍu gūḍĕ
siṁta nīgĕṁdunnadaṁṭe sĕkkunŏkka nem̐ṭige