అడుగవే నా గుణము అది తానే యెరుఁగును
(॥పల్లవి॥)
అడుగవే నా గుణము అది తానే యెరుఁగును
అడరి నేఁ గలపుకోలై వుండనటవే
(॥ఆడు॥)
పంతమాడవద్దుగాని పైకొని రమణుఁడు దా
వంతుకు నవ్వి తిట్టితే వద్దనేనటే
వింతసేయవద్దుగాని వేడుకతో నూడిగాలు
యెంత సేయించుకొన్నాను ఇయ్యకొననటవే
(॥ఆడు॥)
గుట్టుసేయవద్దుగాని కూడిమాడి నాతోను
గట్టిగాఁ బెనఁగితేను కాదనేనటే
రట్టుసేయవద్దుగాని యిట్టె రతి నేకతాన
యెట్టు సేయించుకొన్నాను యెగ్గులెంచేనటనే
(॥ఆడు॥)
వాసి చూపవద్దుగాని వడి శ్రీవేంకటేశుఁడు
ఆస నెంత గూడినాను అలసేనటే
వేసరించవద్దుగాని వెలయ నన్నేలినాఁడు
చేసిన మేలెల్లానుఁ జేకోనటవే
(||pallavi||)
aḍugave nā guṇamu adi tāne yĕrum̐gunu
aḍari nem̐ galabugolai vuṁḍanaḍave
(||āḍu||)
paṁtamāḍavaddugāni paigŏni ramaṇum̐ḍu dā
vaṁtugu navvi tiṭṭide vaddanenaḍe
viṁtaseyavaddugāni veḍugado nūḍigālu
yĕṁta seyiṁchugŏnnānu iyyagŏnanaḍave
(||āḍu||)
guṭṭuseyavaddugāni kūḍimāḍi nādonu
gaṭṭigām̐ bĕnam̐gidenu kādanenaḍe
raṭṭuseyavaddugāni yiṭṭĕ radi negadāna
yĕṭṭu seyiṁchugŏnnānu yĕggulĕṁchenaḍane
(||āḍu||)
vāsi sūbavaddugāni vaḍi śhrīveṁkaḍeśhum̐ḍu
āsa nĕṁta gūḍinānu alasenaḍe
vesariṁchavaddugāni vĕlaya nannelinām̐ḍu
sesina melĕllānum̐ jegonaḍave