Adugare yee suddi yauno kaado

అడుగరే యీ సుద్ది యౌనో కాదో
Language

(॥పల్లవి॥)
అడుగరే యీ సుద్ది యౌనో కాదో
పడఁతులాల తనభావము దెలియను

(॥అడు॥)
యెంతకు నంతేకాని యెక్కుడుబాఁతౌనటే
పంతాన తాఁబిలిచితేఁ బలికితిని
అంతలోనే సొలయుచు నప్పటివిఁ గొసరీని
వింతదాననా తనవిధము దెలియనా

(॥అడు॥)
కలది కలట్టే కాక కపటము నిజమటే
అలరి వీడెమిచ్చితే నందుకొంటివి
బలిమిఁ బైకొననంటా పలుమారుదూరీని
సిలుగుదాననా తనచిత్తము దెలియనా

(॥అడు॥)
యెప్పటికప్పుడే కాక యిఁక సంగతౌనటే
ముప్పిరి దాఁజూచి తేను మొక్కితిని
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డెనసియు నాసపడీ
తప్పించేదాననా తగవు దెలియనా

(||pallavi||)
aḍugare yī suddi yauno kādo
paḍam̐tulāla tanabhāvamu dĕliyanu

(||aḍu||)
yĕṁtagu naṁtegāni yĕkkuḍubām̐taunaḍe
paṁtāna tām̐bilisidem̐ baligidini
aṁtalone sŏlayusu nappaḍivim̐ gŏsarīni
viṁtadānanā tanavidhamu dĕliyanā

(||aḍu||)
kaladi kalaṭṭe kāga kabaḍamu nijamaḍe
alari vīḍĕmichchide naṁdugŏṁṭivi
balimim̐ baigŏnanaṁṭā palumārudūrīni
silugudānanā tanasittamu dĕliyanā

(||aḍu||)
yĕppaḍigappuḍe kāga yim̐ka saṁgadaunaḍe
muppiri dām̐jūsi tenu mŏkkidini
yippuḍe śhrīveṁkaḍeśhum̐ ḍĕnasiyu nāsabaḍī
tappiṁchedānanā tagavu dĕliyanā