అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని
(॥పల్లవి॥)
అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని
యెడయక పెనఁగితే నిచ్చగించీనా
(॥॥)
నాలినేసి నాతోను నమ్మికమాట లాడి
యేల బేరిజోకొట్టీనే యిప్పుడు తాను
వాలాయించి నేఁ గనక వలెనని పైకొంటేను
వోలి నన్నిటికీఁ దాను వొడఁబడీనా
(॥॥)
చాయలా సన్నలాఁ జూపి సారె నాతో నవ్వీని
ఱాయి గిలిగించనేలే ఱట్టుతోఁ దాను
పాయక నేనందుకును బాఁతిపడి కొసరితే
నాయము దప్పక తాను నడఁపఁగఁగలఁడా
(॥॥)
గారవించి నన్నుఁ గూడె కడునిచ్చకము చేసి
యేరు నిద్రవుత్తురటే యింతలోఁ దాను
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిందుకు నే వేడుకొంటే
వూరట నారతులకు నొడిగట్టీనా
(||pallavi||)
aḍugare sĕlulāla āsalela pĕṭṭīni
yĕḍayaga pĕnam̐gide nichchagiṁchīnā
(||||)
nālinesi nādonu nammigamāḍa lāḍi
yela berijogŏṭṭīne yippuḍu tānu
vālāyiṁchi nem̐ ganaga valĕnani paigŏṁṭenu
voli nanniḍigīm̐ dānu vŏḍam̐baḍīnā
(||||)
sāyalā sannalām̐ jūbi sārĕ nādo navvīni
ṟāyi giligiṁchanele ṟaṭṭudom̐ dānu
pāyaga nenaṁdugunu bām̐tibaḍi kŏsaride
nāyamu dappaga tānu naḍam̐pam̐gam̐galam̐ḍā
(||||)
gāraviṁchi nannum̐ gūḍĕ kaḍunichchagamu sesi
yeru nidravutturaḍe yiṁtalom̐ dānu
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍiṁdugu ne veḍugŏṁṭe
vūraḍa nāradulagu nŏḍigaṭṭīnā