(॥పల్లవి॥)
అడుగరే ఆతనినే అవునోకాదో
వెడ వెడ మాటలెల్లా వేడుకలౌనా
(॥అడు॥)
మనసురానిచోట మగుడి మగుడి వచ్చి
చనవులు నెరపితే సంగతులౌనా
పెనఁగుతా నుండఁగాను ప్రియములు పచారించి
చెనకఁబోతేఁ దనకు చేతికి లోనౌదురా
(॥అడు॥)
చలము సాదించేలేళ చవులు సేసుకొని
పిలిచి విందుచెప్పితే ప్రియము లౌనా
వలపు చాలకుండఁగా వడివెట్టి వడివెట్టి
బలిమిఁ గాఁగిలించెతే బత్తి సేతురా
(॥అడు॥)
సిగ్గువడివుండఁగాను చెక్కునొక్కి వేఁడుకొని
వొగ్గి విడెమిచ్చితు వొడఁబాటౌనా
అగ్గమై శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
కగ్గులేక కూడె నిఁకఁ గపటము లెంతురా
(||pallavi||)
aḍugare ādanine avunogādo
vĕḍa vĕḍa māḍalĕllā veḍugalaunā
(||aḍu||)
manasurānisoḍa maguḍi maguḍi vachchi
sanavulu nĕrabide saṁgadulaunā
pĕnam̐gudā nuṁḍam̐gānu priyamulu pasāriṁchi
sĕnagam̐bodem̐ danagu sedigi lonaudurā
(||aḍu||)
salamu sādiṁcheleḽa savulu sesugŏni
pilisi viṁdusĕppide priyamu launā
valabu sālaguṁḍam̐gā vaḍivĕṭṭi vaḍivĕṭṭi
balimim̐ gām̐giliṁchĕde batti sedurā
(||aḍu||)
sigguvaḍivuṁḍam̐gānu sĕkkunŏkki vem̐ḍugŏni
vŏggi viḍĕmichchidu vŏḍam̐bāḍaunā
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
kaggulega kūḍĕ nim̐kam̐ gabaḍamu lĕṁturā