Adugaraadaa buddi aabene neevu

అడుగరాదా బుద్ది ఆపెనే నీవు
Language

(॥పల్లవి॥)
అడుగరాదా బుద్ది ఆపెనే నీవు
కడనుండేవారికిఁ గాఁ గాఁకలఁ బడుదురా

(॥అడు॥)
మేనవారితోడనే మేలమాడుదువుగాక
నాననిజాణతనాలు నాతో నేఁటికి
కానికిచ్చే యాపెకే కప్పుర మిత్తువుగాక
తానకమైవుండేనాకుఁ దమ్ముల మిడుదురా

(॥అడు॥)
మునుపటిదేవులనే మోపఁజెనకుదుగాక
ననచనినగవులు నాతో నేఁటికి
పనులు సేసేయాపెనే పైపై మెత్తువుగాక
మనికైవుండే నన్ను మన్నించవలెనా

(॥అడు॥)
పమ్మి రొమ్ముపై యాపెకే బాసలు సేతువుగాక
నమ్మికయానలువెట్ట నాతోనేఁటికి
కమ్మర నాపెనే శ్రీవేంకటేశ కూడుదుగాక
యెమ్మెకు నన్ను నేలితి వింత సేయఁదగవా

(||pallavi||)
aḍugarādā buddi ābĕne nīvu
kaḍanuṁḍevārigim̐ gām̐ gām̐kalam̐ baḍudurā

(||aḍu||)
menavāridoḍane melamāḍuduvugāga
nānanijāṇadanālu nādo nem̐ṭigi
kānigichche yābĕge kappura mittuvugāga
tānagamaivuṁḍenāgum̐ dammula miḍudurā

(||aḍu||)
munubaḍidevulane mobam̐jĕnagudugāga
nanasaninagavulu nādo nem̐ṭigi
panulu seseyābĕne paibai mĕttuvugāga
manigaivuṁḍe nannu manniṁchavalĕnā

(||aḍu||)
pammi rŏmmubai yābĕge bāsalu seduvugāga
nammigayānaluvĕṭṭa nādonem̐ṭigi
kammara nābĕne śhrīveṁkaḍeśha kūḍudugāga
yĕmmĕgu nannu nelidi viṁta seyam̐dagavā