అటు గనక నేస్తము లమరు మీ కిద్దరికి
(॥పల్లవి॥)
అటు గనక నేస్తము లమరు మీ కిద్దరికి
కుటిలాలు లేవు మంచి గుణములే కాని
(॥అటు॥)
మరిగినవారికి మచ్చికగలవారికి
యరపరికములేదు యేమి సేసినా
సరసమాడేవారికి చనవుగలవారికి
విరసములేదు మరి వేడుకే కాని
(॥అటు॥)
ఆసగలవారికి ఆతుమైనవారికి
యీసు లేదు మదిలోన యెట్టుండినా
వాసిగలవారికి వలపుగలవారికి
వేసట లేదు మరి వినోదమే కాని
(॥అటు॥)
యిచ్చకపువారికి మెనసినవారికి
మచ్చరము లేదు యెన్నిమాఁట లాడినా
యిచ్చట శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
హెచ్చుకుందు లేదు మీకు నింపులేకాని
(||pallavi||)
aḍu ganaga nestamu lamaru mī kiddarigi
kuḍilālu levu maṁchi guṇamule kāni
(||aḍu||)
mariginavārigi machchigagalavārigi
yarabarigamuledu yemi sesinā
sarasamāḍevārigi sanavugalavārigi
virasamuledu mari veḍuge kāni
(||aḍu||)
āsagalavārigi ādumainavārigi
yīsu ledu madilona yĕṭṭuṁḍinā
vāsigalavārigi valabugalavārigi
vesaḍa ledu mari vinodame kāni
(||aḍu||)
yichchagabuvārigi mĕnasinavārigi
machcharamu ledu yĕnnimām̐ṭa lāḍinā
yichchaḍa śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
hĕchchuguṁdu ledu mīgu niṁpulegāni