Adu gaana neegu lonaidimgaaga yee

అటు గాన నీకు లోనైతిఁగాక యీ
Language

(॥పల్లవి॥)
అటు గాన నీకు లోనైతిఁగాక యీ-
చిటుకు లిన్నియు నీచేతివే కదే

(॥అటు॥)
కంతునియమ్ములైతే కతలలోనేకానీ
ఇంతి నీచూపులైతే నివె దిష్టము
కాంతిమెఱుఁగులైతే కాలవేలాలఁగాని
చెంత నీమేనిమించు చేగలుదేరీనే

(॥అటు॥)
మెలుపువెన్నెలలైతే మిన్నులపైసుద్దు లింతే
కలికి నీనవ్వులైతేఁ గడుఁజేరువ
చిలుకపలుకులు పెంచవుఁబోలికలు గాని
అలరు నీమాటలెల్ల నచ్చముగదే

(॥అటు॥)
వొట్టినచిగురులెల్ల నొగరువేసీఁగాని
గట్టిగా నీమోవి తెనెగారీఁగదే
యిట్టివేళ శ్రీవేంకటేశుఁడఁగనక నాకు
దిట్టవై నీకాఁగిలిచ్చి తిరమైతివే

(||pallavi||)
aḍu gāna nīgu lonaidim̐gāga yī-
siḍugu linniyu nīsedive kade

(||aḍu||)
kaṁtuniyammulaide kadalalonegānī
iṁti nīsūbulaide nivĕ diṣhṭamu
kāṁtimĕṟum̐gulaide kālavelālam̐gāni
sĕṁta nīmenimiṁchu segaluderīne

(||aḍu||)
mĕlubuvĕnnĕlalaide minnulabaisuddu liṁte
kaligi nīnavvulaidem̐ gaḍum̐jeruva
silugabalugulu pĕṁchavum̐boligalu gāni
alaru nīmāḍalĕlla nachchamugade

(||aḍu||)
vŏṭṭinasigurulĕlla nŏgaruvesīm̐gāni
gaṭṭigā nīmovi tĕnĕgārīm̐gade
yiṭṭiveḽa śhrīveṁkaḍeśhum̐ḍam̐ganaga nāgu
diṭṭavai nīgām̐gilichchi tiramaidive