Adiraajasabuvaamda vauduvu neevu

అతిరాజసపువాఁడ వౌదువు నీవు
Language

(॥పల్లవి॥)
అతిరాజసపువాఁడ వౌదువు నీవు
సతమాయఁ బనులెల్లాఁ జనవియ్యవయ్యా

(॥అతి॥)
మనసువు గలసితే మాటలకు లోఁగావలె
ననుపులు గలిగితే నవ్వఁగవలె
చెనకులే యితవైతే చెప్పినట్టు సేయవలె
పెనఁగకుమిఁక నింతి పిలిచి రావయ్యా

(॥అతి॥)
వేడుకలు వుట్టితేను విన్నపాలు వినవలె
వాడిక లింపులై తేను వలవవలె
యీడుజొడై మెలఁగితే నిన్నీ నియ్యకొనవలె
వొడక చెలిమాటల కొడఁబడవయ్యా

(॥అతి॥)
ఆసలఁ దగులైతేను ఆయాలు గరఁగవలె
బాసలు దలఁచుకొంటేఁ బైకొనవలె
వాసితో శ్రీవేంకటేశ వచ్చికూడితి వింతలో
మోసపొ కేపొద్దూ నీకెముందర నుండవయ్యా

(||pallavi||)
adirājasabuvām̐ḍa vauduvu nīvu
sadamāyam̐ banulĕllām̐ janaviyyavayyā

(||adi||)
manasuvu galaside māḍalagu lom̐gāvalĕ
nanubulu galigide navvam̐gavalĕ
sĕnagule yidavaide sĕppinaṭṭu seyavalĕ
pĕnam̐gagumim̐ka niṁti pilisi rāvayyā

(||adi||)
veḍugalu vuṭṭidenu vinnabālu vinavalĕ
vāḍiga liṁpulai tenu valavavalĕ
yīḍujŏḍai mĕlam̐gide ninnī niyyagŏnavalĕ
vŏḍaga sĕlimāḍala kŏḍam̐baḍavayyā

(||adi||)
āsalam̐ dagulaidenu āyālu garam̐gavalĕ
bāsalu dalam̐sugŏṁṭem̐ baigŏnavalĕ
vāsido śhrīveṁkaḍeśha vachchigūḍidi viṁtalo
mosabŏ kebŏddū nīgĕmuṁdara nuṁḍavayyā