Adiginaam jeppadu amgana tanasemtalu

అడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు
Language

(॥పల్లవి॥)
అడిగినాఁ జెప్పదు అంగన తనచేఁతలు
సుడిగొనీ వలపులఁ జూడరమ్మా

(॥అడి॥)
చెక్కునఁబెట్టినచేయిచిరుఁజెమటనొసలు
చుక్కలు గాసేటి మోవి చూడరామ్మా
జక్కువ చన్నులమీఁద జారిన పయ్యెదకొంగు
చొక్కవుకళలమోము చూడరమ్మా

(॥అడి॥)
నెరులు చెదరుఁ గొప్పు విరులు రాలేటి చొప్పు
సొరిది లేఁతనవ్వులు చూడరమ్మా
గరమతోడఁ జిట్లుగందాల ముంజేతి
సురతపు సింగారాలు చూడరమ్మ

(॥అడి॥)
పెనఁగే హారాలు మెడ ప్రేమఁ జొక్కేఁటి తనువు
జునిఁగే శిరసు వంపు చూడరమ్మా
యెనసె శ్రీవేంకటేశుఁ డిందాఁకాఁ దను రతుల
చొనిపీ నేరుపులెల్లాఁ జూడరమ్మా

(||pallavi||)
aḍiginām̐ jĕppadu aṁgana tanasem̐talu
suḍigŏnī valabulam̐ jūḍarammā

(||aḍi||)
sĕkkunam̐bĕṭṭinaseyisirum̐jĕmaḍanŏsalu
sukkalu gāseḍi movi sūḍarāmmā
jakkuva sannulamīm̐da jārina payyĕdagŏṁgu
sŏkkavugaḽalamomu sūḍarammā

(||aḍi||)
nĕrulu sĕdarum̐ gŏppu virulu rāleḍi sŏppu
sŏridi lem̐tanavvulu sūḍarammā
garamadoḍam̐ jiṭlugaṁdāla muṁjedi
suradabu siṁgārālu sūḍaramma

(||aḍi||)
pĕnam̐ge hārālu mĕḍa premam̐ jŏkkem̐ṭi tanuvu
junim̐ge śhirasu vaṁpu sūḍarammā
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁdām̐kām̐ danu radula
sŏnibī nerubulĕllām̐ jūḍarammā