(॥పల్లవి॥)
అతిత నింతసేతురా అవునయ్యా
తతితో నవ్వులు రాఁగా తలవంచుకొనెను
(॥అతి॥)
సింగారించుకొని రాఁగాచిమ్మనఁగోవినీరు
అంగనపై జిమ్మితివి ఆవునయ్యా
చెంగావిదువ్వటము చిప్పిలి యంటుకొంటే
అంగాలెల్లఁ గానరాఁగా నట్టె సిగ్గువడెను
(॥అతి॥)
కిన్నెర మీటుతా రాఁగా గిన్నెలఁ గప్పురధూళి
అన్నిటా మంచిపోసితి వౌనయ్యా
వున్న తపుఁగొప్పు వీడి వొగిఁ గాళ్లఁదొడరఁగా
కన్నులుమూసుక నిన్నుఁ గాఁగిలించుకొనెను
(॥అతి॥)
చెంది నీ కొప్పఁటరాఁగా చెంగలువ రేకులను
అందియంది వేసితివి అవునయ్యా
గొందినె శ్రీవేంకటేశ కూడి మేను చొక్కరాఁగా
సందడి నీపచ్చడము సరిఁ గప్పుకొనెను
(||pallavi||)
adida niṁtasedurā avunayyā
tadido navvulu rām̐gā talavaṁchugŏnĕnu
(||adi||)
siṁgāriṁchugŏni rām̐gāsimmanam̐govinīru
aṁganabai jimmidivi āvunayyā
sĕṁgāviduvvaḍamu sippili yaṁṭugŏṁṭe
aṁgālĕllam̐ gānarām̐gā naṭṭĕ sigguvaḍĕnu
(||adi||)
kinnĕra mīḍudā rām̐gā ginnĕlam̐ gappuradhūḽi
anniḍā maṁchibosidi vaunayyā
vunna tabum̐gŏppu vīḍi vŏgim̐ gāḽlam̐dŏḍaram̐gā
kannulumūsuga ninnum̐ gām̐giliṁchugŏnĕnu
(||adi||)
sĕṁdi nī kŏppam̐ṭarām̐gā sĕṁgaluva regulanu
aṁdiyaṁdi vesidivi avunayyā
gŏṁdinĕ śhrīveṁkaḍeśha kūḍi menu sŏkkarām̐gā
saṁdaḍi nībachchaḍamu sarim̐ gappugŏnĕnu