అది యేల నీవు చెప్పినట్టు చేసేనే
(॥పల్లవి॥)
అది యేల నీవు చెప్పినట్టు చేసేనే
కదిసితి మిఁకనేల కంటి మన్నిపనులు
(॥అది॥)
బాససేయుమంటే నేఁ బాముఁ బట్టేనే అవులే
భాసురపునీపరపు పామేకాదా
మోసదీర జలధి ఇమ్ములఁ జొచ్చేనే నీవు
వాసికి జలధిఁబండేవాఁడవే కాదా
(॥అది॥)
చింతదీర ననలంబు చేతఁబట్టేనే తొల్లి
బంతి నగ్నిమింగినట్టిబాలుఁడవేకా
దొంతరకొండలతో నేఁ దులఁదూఁగేనే నీ-
కింతేల గోవర్దనగిరెత్తవా తొల్లి
(॥అది॥)
యెంచనేల మీఁదిమాట లేమనేవే అయితే
పంచ నొక్క యక్షరమె పంతమీవయ్యా
పెంచనేల నీకు నాకు భేదమటవే యిఁకఁ
గొంచక శ్రీవేంకటేశ కూడితి యిందులకు
(||pallavi||)
adi yela nīvu sĕppinaṭṭu sesene
kadisidi mim̐kanela kaṁṭi mannibanulu
(||adi||)
bāsaseyumaṁṭe nem̐ bāmum̐ baṭṭene avule
bhāsurabunībarabu pāmegādā
mosadīra jaladhi immulam̐ jŏchchene nīvu
vāsigi jaladhim̐baṁḍevām̐ḍave kādā
(||adi||)
siṁtadīra nanalaṁbu sedam̐baṭṭene tŏlli
baṁti nagnimiṁginaṭṭibālum̐ḍavegā
dŏṁtaragŏṁḍalado nem̐ dulam̐dūm̐gene nī-
kiṁtela govardanagirĕttavā tŏlli
(||adi||)
yĕṁchanela mīm̐dimāḍa lemaneve ayide
paṁcha nŏkka yakṣharamĕ paṁtamīvayyā
pĕṁchanela nīgu nāgu bhedamaḍave yim̐kam̐
gŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidi yiṁdulagu