పల్లవి:
అది ఒకటో నెంబర్ బస్సు దాని యవ్వారం నాకు తెలుసూ || 2 ||
దాంది గొల్లపూడి రూటు... అయినా కంకిపాడు దాటు || 2 ||
రైటంటె చాలు రయ్యి రయ్యనా రైకలపూడి హాల్టూ
అది బస్సు కాదు మిస్సూ ... అబ్బ చూడు దాని కస్సు బుస్సూ || 2 ||
ఇది ఒకటో నెంబరు మిస్సూ ... దీని వయ్యారం నైసూ || 2 ||
దాని కన్ను పడితే కాటు ... అయినా చెయ్యి పడితే స్వీటూ || 2 ||
స్టార్ట్ అయితే చాలు సంధ్యవేళకీ కౌగిళ్ళపల్లె హాల్టూ
అది బస్సు కాదు మిస్సూ ... అబ్బ మిస్సు కాకు కిస్సు మిస్సూ || 2 ||
చరణం 1:
చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ || 2 ||
పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసీ
నో నోనోనో అన్నా ఆ మూడు ముళ్ళేసీ || 2 ||
దాంది జాస్మిన్ వైటూ నాకు తగ్గ హైటూ
హైటు కట్టిపెట్టు పైట కొంగు పట్టు అవుతుందిలే ఆల్రైటూ
రైట్ రైట్...
అది బస్సు కాదు మిస్సూ... అబ్బ చూడు దాని కస్సు బుస్సూ || 2 ||
ఇది ఒకటో నెంబరు మిస్సూ... దీని వయ్యారం నైసు నైసూ
దాంది గొల్లపూడి రూటు .. అయినా కంకిపాడు దాటు || 2 ||
ఆఁ.. స్టార్ట్ అయితే చాలు సంధ్యవేళకీ కౌగిళ్ళపల్లె హాల్టూ
అరే హోల్డాన్
చరణం 2:
ఎందుకో అందనందుకో తైతక్కర కిలాడీ
ఎందరో ఏమారినా ఆల్బిత్తరు కిలేడీ || 2 ||
వా వారెవా దాని వన్నెల కన్నేసీ
జ జలజ అని పేరెట్టి పిలిచేసీ || 2 ||
అరె కొట్టి చూడు సైటు... దాని కొంప కాడ బీటు
నీ ప్రేమ టిక్కెట్టు కాదంటే ఇక్కట్టు చేరుకోర పెళ్ళిరూటు
అరెరె హహహ
అది బస్సు కాదు మిస్సూ... అబ్బ చూడు దాని కస్సు బుస్సూ || 2 ||
ఇది ఒకటో నెంబరు మిస్సూ... దీని వయ్యారం నైసు నైసూ
దాంది గొల్లపూడి రూటు .. అయినా కంకిపాడు దాటు || 2 ||
ఆఁ.. స్టార్ట్ అయితే చాలు సంధ్యవేళకీ కౌగిళ్ళపల్లె హాల్టూ
రైట్... రైట్...