Adi naa mele kaadaa aa vanida nene kaanaa

అది నా మేలే కాదా ఆ వనిత నేనే కానా
Language

(॥పల్లవి॥)
అది నా మేలే కాదా ఆ వనిత నేనే కానా
పోదిగొన నన్నిందు కిపుడే మెచ్చెఁగాక

(॥అది॥)
దగ్గరి వచ్చెనా ఆపె తమకించెనా నీపై
సిగ్గులు వడక నాతోఁ జెప్పరాదా
వెగ్గళించెనా నిన్ను వెరపు నీకేమిటికి
నిగ్గులఁ బరిణామించి నిండుకొనేఁగాక

(॥అది॥)
అంగన నీతో నవ్వెనా ఆకు మడిచిచ్చెనా
చెంగనేల నాతోఁ గొంత చెప్పరాదా
కంగు వెట్టేనా నీతో కల్ల గుట్టు నీకేఁటికి
పొంగుచు నీ గుణములు పొగడేగాక

(॥అది॥)
కలిసితిరా ఇద్దరు కాఁగిలించెనా నిన్ను
చెలరేఁగి నాతో నిట్టె చెప్పరాదా
అలరి శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
చలివాసి యీరెంటికిఁ జనవిచ్చేగాక

(||pallavi||)
adi nā mele kādā ā vanida nene kānā
podigŏna nanniṁdu kibuḍe mĕchchĕm̐gāga

(||adi||)
daggari vachchĕnā ābĕ tamagiṁchĕnā nībai
siggulu vaḍaga nādom̐ jĕpparādā
vĕggaḽiṁchĕnā ninnu vĕrabu nīgemiḍigi
niggulam̐ bariṇāmiṁchi niṁḍugŏnem̐gāga

(||adi||)
aṁgana nīdo navvĕnā āgu maḍisichchĕnā
sĕṁganela nādom̐ gŏṁta sĕpparādā
kaṁgu vĕṭṭenā nīdo kalla guṭṭu nīgem̐ṭigi
pŏṁgusu nī guṇamulu pŏgaḍegāga

(||adi||)
kalisidirā iddaru kām̐giliṁchĕnā ninnu
sĕlarem̐gi nādo niṭṭĕ sĕpparādā
alari śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
salivāsi yīrĕṁṭigim̐ janavichchegāga