Adela neevaabeseda naadimchevoyi

అదేల నీవాపెచేత నాడించేవోయి
Language

(॥పల్లవి॥)
అదేల నీవాపెచేత నాడించేవోయి
సదరానఁ దన్ను నేను సాదించితినా

(॥అదే॥)
పైపై నిన్నే వెంగెములు పలికి దూరితిఁగాక
ఆపెనేమైనాఁ గోపించి అంటినా నేను
రాపుల నిన్నే కొసరి రాయడించితిఁగాక
చాఁపుచుఁజేతులఁ దన్ను జరసితినా

(॥అదే॥)
తివిరి నీ మేనునాఁట దిష్టించి చూచితిఁగాక
సవతెంటాఁ గన్నులను జంకించితినా
పవళించుమని నిన్నే బలిమి సేసితిఁగాక
తవిలి కేరడముతో తన్ను నే నవ్వితినా

(॥అదే॥)
చలపట్టి నిన్నుఁ గోరి సన్నలు చేసితిఁగాక
తలకొని చెల్లెలంటాఁ దడవితినా
నెలవై శ్రీవేంకటేశ నిన్ను నే మెచ్చితిఁగాక
అలమేలుమంగను నే నట్టె తన్నెంచితినా

(||pallavi||)
adela nīvābĕseda nāḍiṁchevoyi
sadarānam̐ dannu nenu sādiṁchidinā

(||ade||)
paibai ninne vĕṁgĕmulu paligi dūridim̐gāga
ābĕnemainām̐ gobiṁchi aṁṭinā nenu
rābula ninne kŏsari rāyaḍiṁchidim̐gāga
sām̐pusum̐jedulam̐ dannu jarasidinā

(||ade||)
tiviri nī menunām̐ṭa diṣhṭiṁchi sūsidim̐gāga
savadĕṁṭām̐ gannulanu jaṁkiṁchidinā
pavaḽiṁchumani ninne balimi sesidim̐gāga
tavili keraḍamudo tannu ne navvidinā

(||ade||)
salabaṭṭi ninnum̐ gori sannalu sesidim̐gāga
talagŏni sĕllĕlaṁṭām̐ daḍavidinā
nĕlavai śhrīveṁkaḍeśha ninnu ne mĕchchidim̐gāga
alamelumaṁganu ne naṭṭĕ tannĕṁchidinā