అద్దములోఁ జూచుకోవే అలమేల్మంగా
(॥పల్లవి॥)
అద్దములోఁ జూచుకోవే అలమేల్మంగా
నిద్దపు సింగారాలు నీకే కానవచ్చీని
(॥అద్ద॥)
మొలక చన్నులమీఁది ముద్దు చంద్రవంకలు
తళుకుఁ జెక్కులమీఁది తమలంపు టంట్లు
నిలువుఁ దురుముమీఁది నెయ్యపుఁ జేపట్లు
బయలు నీ వలపెల్లాఁ బచ్చిసెసెఁగదవే
(॥అద్ద॥)
చిగురుమోవిమీఁది చిన్ని చిన్ని కెంపులు
జిగిమించు నొసలిపై చిరుత చెమటలు
మొగములో వసివాడు ముసి ముసి నవ్వులు
పగటు నీ వలపులు పచ్చిసేసెఁగదవే
(॥అద్ద॥)
చక్కని నీ మేనిమీఁది జవ్వాది కరఁగులు
మొక్కలపు కుచ్చులపై మొలనూలి జారులు
వెక్కసపు కాఁగిట శ్రీవేంకటేశు కూటములు
పక్కన నీ వలపులు పచ్చిసేసెఁగదవే
(||pallavi||)
addamulom̐ jūsugove alamelmaṁgā
niddabu siṁgārālu nīge kānavachchīni
(||adda||)
mŏlaga sannulamīm̐di muddu saṁdravaṁkalu
taḽugum̐ jĕkkulamīm̐di tamalaṁpu ṭaṁṭlu
niluvum̐ durumumīm̐di nĕyyabum̐ jebaṭlu
bayalu nī valabĕllām̐ bachchisĕsĕm̐gadave
(||adda||)
sigurumovimīm̐di sinni sinni kĕṁpulu
jigimiṁchu nŏsalibai siruda sĕmaḍalu
mŏgamulo vasivāḍu musi musi navvulu
pagaḍu nī valabulu pachchisesĕm̐gadave
(||adda||)
sakkani nī menimīm̐di javvādi karam̐gulu
mŏkkalabu kuchchulabai mŏlanūli jārulu
vĕkkasabu kām̐giḍa śhrīveṁkaḍeśhu kūḍamulu
pakkana nī valabulu pachchisesĕm̐gadave