Addamaredirigaada naanalela pettevu

అద్దమరేతిరికాడ నానలేల పెట్టేవు
Language

(॥పల్లవి॥)
అద్దమరేతిరికాడ నానలేల పెట్టేవు
ఇద్దరికిఁ దగు నివి యింకాఁ గొంత వలెనా

(॥అద్ద॥)
పొరుగున నుండి యాపె పొందులు నీతోఁ జేయఁగ
విరులను సారె సారె వేయఁగాను
దొరకొని నీ మొగము తొంగి తొంగి చూడఁగాను
మరిగె నీమనసందు మరి యేఁటి సుద్దులు

(॥అద్ద॥)
యెదుటనే వుండి యాపె యెడమాటలాడించఁగా
పెదవి సన్నల నిన్నుఁ బిలువఁగాను
వెదకి వెదకి నీకు వేఁడుకొని మొక్కఁగాను
తుదకెక్కె నీ మోహము దూరనేల నిన్నును

(॥అద్ద॥)
పానుపు పైనుండి యాపై బత్తి నీపైఁ జేయఁగాను
నానఁబెట్టి పదరక నవ్వఁగాను
పూని శ్రీ వేంకటేశుఁడ పొంచి నన్ను నేలితివి
తానూ నిన్నుఁ బెండ్లాడె తప్పులేదు నీకును

(||pallavi||)
addamaredirigāḍa nānalela pĕṭṭevu
iddarigim̐ dagu nivi yiṁkām̐ gŏṁta valĕnā

(||adda||)
pŏruguna nuṁḍi yābĕ pŏṁdulu nīdom̐ jeyam̐ga
virulanu sārĕ sārĕ veyam̐gānu
dŏragŏni nī mŏgamu tŏṁgi tŏṁgi sūḍam̐gānu
marigĕ nīmanasaṁdu mari yem̐ṭi suddulu

(||adda||)
yĕduḍane vuṁḍi yābĕ yĕḍamāḍalāḍiṁcham̐gā
pĕdavi sannala ninnum̐ biluvam̐gānu
vĕdagi vĕdagi nīgu vem̐ḍugŏni mŏkkam̐gānu
tudagĕkkĕ nī mohamu dūranela ninnunu

(||adda||)
pānubu painuṁḍi yābai batti nībaim̐ jeyam̐gānu
nānam̐bĕṭṭi padaraga navvam̐gānu
pūni śhrī veṁkaḍeśhum̐ḍa pŏṁchi nannu nelidivi
tānū ninnum̐ bĕṁḍlāḍĕ tappuledu nīgunu