Adanigi naagu naide namarumgaaga

అతనికి నాకు నైతే నమరుఁగాక
Language

(॥పల్లవి॥)
అతనికి నాకు నైతే నమరుఁగాక
రతికెక్కఁ బాయపువారము మమ్ముఁ జూడవే

(॥అత॥)
పొలఁతి నీవురమునఁ బోఁకలంతలే చన్నులు
యెలమి నాతనితోడ నెమినవ్వేవే
వులివచ్చి సిగ్గులెల్లా నొడిఁగట్టుకుందానవు
సొలసి సొలసి యేమి చూచేవే నీవు

(॥అత॥)
నిన్ననే కన్నెవు మరి నేఁడే జవ్వనివైతివి
యెన్నేసి మాఁట లాడేవే యీతనితోడి
వెన్నవంటిది మనసు వేళమే కరఁగు నీకు
సన్నలా చాయలా నెంత సరసమాడేవే

(॥అత॥)
దొండపండు నీమోవి తొడమ యింకాఁబచ్చన
అండనుండి నీకెం(వెం?) త ఆసచూపేవే
దండిగా నన్నేలినాఁడు తానే శ్రీవేంకటేశుఁడు
మెండుగాఁ జెనకే వెంత మేలుదానవే

(||pallavi||)
adanigi nāgu naide namarum̐gāga
radigĕkkam̐ bāyabuvāramu mammum̐ jūḍave

(||ada||)
pŏlam̐ti nīvuramunam̐ bom̐kalaṁtale sannulu
yĕlami nādanidoḍa nĕminavveve
vulivachchi siggulĕllā nŏḍim̐gaṭṭuguṁdānavu
sŏlasi sŏlasi yemi sūseve nīvu

(||ada||)
ninnane kannĕvu mari nem̐ḍe javvanivaidivi
yĕnnesi mām̐ṭa lāḍeve yīdanidoḍi
vĕnnavaṁṭidi manasu veḽame karam̐gu nīgu
sannalā sāyalā nĕṁta sarasamāḍeve

(||ada||)
dŏṁḍabaṁḍu nīmovi tŏḍama yiṁkām̐bachchana
aṁḍanuṁḍi nīgĕṁ(vĕṁ?) ta āsasūbeve
daṁḍigā nannelinām̐ḍu tāne śhrīveṁkaḍeśhum̐ḍu
mĕṁḍugām̐ jĕnage vĕṁta meludānave