Adanido naavinnaba made yanave

అతనితో నావిన్నప మదే యనవే
Language

(॥పల్లవి॥)
అతనితో నావిన్నప మదే యనవే
కాతరపు నా వలపు కారుకమ్మీ ననవే

(॥అత॥)
యెప్పుడూఁ దా మన్నించేది యెఱుఁగుదుననవే
యిప్పటినాతమి వోర్వనియ్యదనవే
తప్పులేదు తనమాట దయగలండనవే
రెప్పలెత్తి చూచుదాంకా రేఁచీ నావలనవే

(॥అత॥)
తిరమైననాపైబత్తి తెలిసితి ననవే
సరి విరహానఁ బడఁజాల ననవే
కరుణించి నన్నిఁకను కంటి నన్నీననవే
మరిగించి వట్టిజోలి మరియేఁటికనవే

(॥అత॥)
తగ నన్నుఁ గూడినాఁడు తలఁతు నే ననవే
తెగనిరతులఁ గాంక్ష దీరదనవే
జిగి నలమేల్ మంగను శ్రీవేంకటేశుఁడు తాను
మిగులా నన్నేలినాఁడు మెచ్చితి నేననవే

(||pallavi||)
adanido nāvinnaba made yanave
kādarabu nā valabu kārugammī nanave

(||ada||)
yĕppuḍūm̐ dā manniṁchedi yĕṟum̐gudunanave
yippaḍinādami vorvaniyyadanave
tappuledu tanamāḍa dayagalaṁḍanave
rĕppalĕtti sūsudāṁkā rem̐sī nāvalanave

(||ada||)
tiramainanābaibatti tĕlisidi nanave
sari virahānam̐ baḍam̐jāla nanave
karuṇiṁchi nannim̐kanu kaṁṭi nannīnanave
marigiṁchi vaṭṭijoli mariyem̐ṭiganave

(||ada||)
taga nannum̐ gūḍinām̐ḍu talam̐tu ne nanave
tĕganiradulam̐ gāṁkṣha dīradanave
jigi nalamel maṁganu śhrīveṁkaḍeśhum̐ḍu tānu
migulā nannelinām̐ḍu mĕchchidi nenanave