Adani vinnavimchare yaadanidonu

అటని విన్నవించరే యాతనితోను
Language

(॥పల్లవి॥)
అటని విన్నవించరే యాతనితోను
తటుకన మిమ్మునేల తగవడిగీని

(॥ఆట॥)
కూడినమందెమేళాన కొమ్మ తెంతగొసరినా
వేడుకపడుటేకాని వేసరరాదు
వాడికైనచోట నెంతవడి యలయించినాను
యీడుజోడై యంటగాని యెడయఁగరాదు

(॥ఆట॥)
చనవులుచేసుకోని సతు లెంతసాదించినా
తనివిఁబొందుటఁగాని తలఁకరాదు
పెనఁగులాడేటిచోట బిరుదు లెంతాడుకొన్నా
ననిచి లోనౌటగాని నంటువాయరాదు

(॥ఆట॥)
కూరిమితో వనితలు గుబ్బల నెంతవొత్తినా
వోరుచుకుండుటగాని వొదుగరాదు
యీరీతి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
సారె నన్నేలుటేకాని జడియఁగరాదు

(||pallavi||)
aḍani vinnaviṁchare yādanidonu
taḍugana mimmunela tagavaḍigīni

(||āḍa||)
kūḍinamaṁdĕmeḽāna kŏmma tĕṁtagŏsarinā
veḍugabaḍuḍegāni vesararādu
vāḍigainasoḍa nĕṁtavaḍi yalayiṁchinānu
yīḍujoḍai yaṁṭagāni yĕḍayam̐garādu

(||āḍa||)
sanavulusesugoni sadu lĕṁtasādiṁchinā
tanivim̐bŏṁduḍam̐gāni talam̐karādu
pĕnam̐gulāḍeḍisoḍa birudu lĕṁtāḍugŏnnā
nanisi lonauḍagāni naṁṭuvāyarādu

(||āḍa||)
kūrimido vanidalu gubbala nĕṁtavŏttinā
vorusuguṁḍuḍagāni vŏdugarādu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sārĕ nanneluḍegāni jaḍiyam̐garādu