అతఁడు నన్ను మన్నించేదంతా నే నెఱుఁగుదు
(॥పల్లవి॥)
అతఁడు నన్ను మన్నించేదంతా నే నెఱుఁగుదు
కతలేమి చెప్పేరే కాంతలాల
(॥అత॥)
వలచినకొలఁదినే వాడికలు గలుగును
పిలుపులోఁ గానవచ్చు ప్రేమమెల్లాను
తలఁపు గలిగితేనే తగులాయముఁ గలుగు
తెలిపి యేమిచెప్పేరే తెఱవలాల
(॥అత॥)
మొగము చూచితేనే మోహమెల్లా గనుపట్టు
నగితేనే వెల్లవిరౌ ననుపెల్లాను
సొగిసి యిచ్చగించితే చుట్టరికము గలుగు
తగ నాకేమిచెప్పేరే తరుణులాల
(॥అత॥)
మేలములు దఱచైతే మేలెల్లా రూడికి నెక్కు
పోలికలనే తోఁచు పొందులెల్లాను
యేలె శ్రీవేంకటేశుఁడు నలమేలుమంగను
లాలించి మేమిచెప్పేరే లలనలాలా
(||pallavi||)
adam̐ḍu nannu manniṁchedaṁtā ne nĕṟum̐gudu
kadalemi sĕppere kāṁtalāla
(||ada||)
valasinagŏlam̐dine vāḍigalu galugunu
pilubulom̐ gānavachchu premamĕllānu
talam̐pu galigidene tagulāyamum̐ galugu
tĕlibi yemisĕppere tĕṟavalāla
(||ada||)
mŏgamu sūsidene mohamĕllā ganubaṭṭu
nagidene vĕllavirau nanubĕllānu
sŏgisi yichchagiṁchide suṭṭarigamu galugu
taga nāgemisĕppere taruṇulāla
(||ada||)
melamulu daṟasaide melĕllā rūḍigi nĕkku
poligalane tom̐su pŏṁdulĕllānu
yelĕ śhrīveṁkaḍeśhum̐ḍu nalamelumaṁganu
lāliṁchi memisĕppere lalanalālā