Achchivachchu nee keppudu namganadodi pomdu

అచ్చివచ్చు నీ కెప్పుడు నంగనతోడి పొందు
Language

(॥పల్లవి॥)
అచ్చివచ్చు నీ కెప్పుడు నంగనతోడి పొందు
కొచ్చి కొచ్చి ఇందు కెంత కోరుకొంటా నుంటివో

(॥॥)
సరుస నిలుచుండఁగా సతితురుములోనుండి
విరులు నీ మీఁద రాలె వింతలుగాన
గరిమఁ దమకమునఁ గమ్మిననిట్టూర్పులు
వరుసతో నీకు నాలవట్టములాయను

(॥॥)
మాటలాడుకొనఁ గాను మనసులేకమై లోలో
వాటములై తగిలెను వావులుగాను
సూటిదప్పకుండా నిన్నుఁ జూడఁగఁ జూడఁ గాను
కోటికొండలై వలపు గుదిగొనె నీకును

(॥॥)
ముట్టి కొలువుసేయఁగ మునుకొని నీపూజకు
గుట్టునఁ జన్నులు పూవుగుత్తులాయను
ఇట్టె శ్రీవెంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
తొట్టి యాపెకూటమి దోమటాయను

(||pallavi||)
achchivachchu nī kĕppuḍu naṁganadoḍi pŏṁdu
kŏchchi kŏchchi iṁdu kĕṁta korugŏṁṭā nuṁṭivo

(||||)
sarusa nilusuṁḍam̐gā sadidurumulonuṁḍi
virulu nī mīm̐da rālĕ viṁtalugāna
garimam̐ damagamunam̐ gamminaniṭṭūrbulu
varusado nīgu nālavaṭṭamulāyanu

(||||)
māḍalāḍugŏnam̐ gānu manasulegamai lolo
vāḍamulai tagilĕnu vāvulugānu
sūḍidappaguṁḍā ninnum̐ jūḍam̐gam̐ jūḍam̐ gānu
koḍigŏṁḍalai valabu gudigŏnĕ nīgunu

(||||)
muṭṭi kŏluvuseyam̐ga munugŏni nībūjagu
guṭṭunam̐ jannulu pūvuguttulāyanu
iṭṭĕ śhrīvĕṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
tŏṭṭi yābĕgūḍami domaḍāyanu