Achcha telugubhaasharaa ammamte

అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
Year
Language

పల్లవి:

అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే

చరణం 1:

ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా...
అవనిమీద సృష్టికర్త అమ్మరా ||2||

గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా

అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

చరణం 2:

అమ్మపాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం ||2||

పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ, జాలి, దయ..
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా...
అమ్మంటే మరో ప్రణవనాదంరా..

అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే...
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే...

pallavi:

achcha tĕlugubhāṣharā ammaṁṭe
achchu veda ghoṣharā ammaṁṭe
āpyāyada kaṁchaṁlo anurāgaṁlā
tŏli annaṁ muddarā ammaṁṭe
ātmīyada phalagaṁpai anubaṁdhaṁlā
tŏli akṣhara mutyaṁrā ammaṁṭe...

achcha tĕlugubhāṣharā ammaṁṭe
achchu veda ghoṣharā ammaṁṭe

saraṇaṁ 1:

āgasāna sṛṣhṭigarda brahmarā...
avanimīda sṛṣhṭigarda ammarā ||2||

godāri kāśhmīraṁ o tirubadi kṣhetraṁ
nīdhyāse niraṁtaraṁ ide amma gotraṁ
ammaṁṭe svachchhamaina śhvāsarā
ammaṁṭe spaṣhṭamaina yāsarā

achcha tĕlugubhāṣharā ammaṁṭe
achchu veda ghoṣharā ammaṁṭe...
āpyāyada kaṁchaṁlo anurāgaṁlā
tŏli annaṁ muddarā ammaṁṭe
ātmīyada phalagaṁpai anubaṁdhaṁlā
tŏli akṣhara mutyaṁrā ammaṁṭe...

saraṇaṁ 2:

ammabāḍa mānavāḽi jādīyagīdaṁ
ammamāḍa āvubāla jalabādaṁ ||2||

pāladoḍi muribālu
ide amma sthanyaṁ
prema karuṇa, jāli, daya..
ive amma sainyaṁ
ammaṁṭe janajīvana vedamurā...
ammaṁṭe maro praṇavanādaṁrā..

achcha tĕlugubhāṣharā ammaṁṭe
achchu veda ghoṣharā ammaṁṭe...
āpyāyada kaṁchaṁlo anurāgaṁlā
tŏli annaṁ muddarā ammaṁṭe
ātmīyada phalagaṁpai anubaṁdhaṁlā
tŏli akṣhara mutyaṁrā ammaṁṭe...