ఆయనాయఁ జాలుఁజాలు నట్టె వుండరా
(॥పల్లవి॥)
ఆయనాయఁ జాలుఁజాలు నట్టె వుండరా
చాయల పలుకు లివి చవులయ్యీనా
(॥ఆయ॥)
యెంతవడి నావద్ద నిచ్చకమై వుండినా
పంతపునీతలఁ పెందుఁ బారకుండీనా
ఇంతలేసియానలు నీ వెన్ని వెట్టుకొన్నాను
కొంతైన నామనసు గొని నమ్మీనా
(॥ఆయ॥)
కడఁగి నీవెంత నన్నుఁ గాఁగిలించుకుండినాను
కడవారిమీఁద నీకుఁ గాఁక మానీనా
విడువక నీవెంత వేసరక బొంకినాను
వుడివోని నామనసు వొడఁబడీనా
(॥ఆయ॥)
కొంకక నీవెంత నాతో గుట్టుసేసుకుండినాను
వుంకువనీతమకము లుండనిచ్చీనా
పొంకపుశ్రీవేంకటేశ భోగపుఁగాఁగిట నన్ను
కంకిగాఁ గూడితివి నేఁ గాదనేనా
(||pallavi||)
āyanāyam̐ jālum̐jālu naṭṭĕ vuṁḍarā
sāyala palugu livi savulayyīnā
(||āya||)
yĕṁtavaḍi nāvadda nichchagamai vuṁḍinā
paṁtabunīdalam̐ pĕṁdum̐ bāraguṁḍīnā
iṁtalesiyānalu nī vĕnni vĕṭṭugŏnnānu
kŏṁtaina nāmanasu gŏni nammīnā
(||āya||)
kaḍam̐gi nīvĕṁta nannum̐ gām̐giliṁchuguṁḍinānu
kaḍavārimīm̐da nīgum̐ gām̐ka mānīnā
viḍuvaga nīvĕṁta vesaraga bŏṁkinānu
vuḍivoni nāmanasu vŏḍam̐baḍīnā
(||āya||)
kŏṁkaga nīvĕṁta nādo guṭṭusesuguṁḍinānu
vuṁkuvanīdamagamu luṁḍanichchīnā
pŏṁkabuśhrīveṁkaḍeśha bhogabum̐gām̐giḍa nannu
kaṁkigām̐ gūḍidivi nem̐ gādanenā