Aayanaaya vemgemele adivaa | nee

ఆయనాయ వెంగెమేలే అతివా । నీ
Language

(॥పల్లవి॥)
ఆయనాయ వెంగెమేలే అతివా । నీ-
ఆయమే తాఁకీ మాఁట లందుకేమి సేతురా

(॥ఆయ॥)
కప్పురమిందవే వోకలికీ మాకు -
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ వోరి
తప్పులెవ్వ రెందున్నవో తలఁచుకో నీవు

(॥ఆయ॥)
నిమ్మ పండిందవే వో నెలఁతా ఆ -
నిమ్మపండే పాఁపరవును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు

(॥ఆయ॥)
కుంకుమపూ విందవే వో కోమలీ; నీ -
కుంకుమలే పుప్పొడౌను కూడుకొంటేను
యింకనేలే కలసితి నింతీ; వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరిచెమటలు

(||pallavi||)
āyanāya vĕṁgĕmele adivā | nī-
āyame tām̐kī mām̐ṭa laṁdugemi sedurā

(||āya||)
kappuramiṁdave vogaligī māgu -
nuppulavu nīgappurā lŏllamu porā
tappanāḍe vadiyeme taruṇī vori
tappulĕvva rĕṁdunnavo talam̐sugo nīvu

(||āya||)
nimma paṁḍiṁdave vo nĕlam̐tā ā -
nimmabaṁḍe pām̐paravunu ne nŏllarā
simmevu saḍa lideme sĕliya mena
simmurekha lĕvvaraṁdo sittagiṁchu nīvu

(||āya||)
kuṁkumabū viṁdave vo komalī; nī -
kuṁkumale puppŏḍaunu kūḍugŏṁṭenu
yiṁkanele kalasidi niṁtī; vori
yiṁkabu śhrīveṁkaḍeśha yiddarisĕmaḍalu