Aayanaaya valasidi vannidaa neevu

ఆయనాయ వలసితి వన్నిటా నీవు
Language

(॥పల్లవి॥)
ఆయనాయ వలసితి వన్నిటా నీవు
మోయరాని వలపులు మోపుగట్టుకొనేవు

(॥ఆయ॥)
చెక్కులవెంటఁగారేచెమట దుడుచుకోవే
యిక్కడ నాపతితోడ నేమినవ్వేవు
చక్కఁబెట్టుకొనవే నీజారినపయ్యదకొంగు
చొక్కుచు నాతని నేమిచూచేవు నీవు

(॥ఆయ॥)
చెదరివిడినకొప్పు సిగ్గుతో ముడుచుకోవే
యెదుట నిలుచుకుండి యేమి మొక్కేవు
వదలినపోఁకముడివంక చూచుకొనవే
కదిసి యంతాతని కేఁకారేవు నీవు

(॥ఆయ॥)
లలిఁ బెదవిపై తమ్ములము గడుగుకొవే
కలయికలకు యేమి కాఁతాళించేవు
అలమి శ్రీవేంకటేశు డన్నిటాను నన్నునేలె
తలఁచి యాతనినేల తడవేవు నీవు

(||pallavi||)
āyanāya valasidi vanniḍā nīvu
moyarāni valabulu mobugaṭṭugŏnevu

(||āya||)
sĕkkulavĕṁṭam̐gāresĕmaḍa duḍusugove
yikkaḍa nābadidoḍa neminavvevu
sakkam̐bĕṭṭugŏnave nījārinabayyadagŏṁgu
sŏkkusu nādani nemisūsevu nīvu

(||āya||)
sĕdariviḍinagŏppu siggudo muḍusugove
yĕduḍa nilusuguṁḍi yemi mŏkkevu
vadalinabom̐kamuḍivaṁka sūsugŏnave
kadisi yaṁtādani kem̐kārevu nīvu

(||āya||)
lalim̐ bĕdavibai tammulamu gaḍugugŏve
kalayigalagu yemi kām̐tāḽiṁchevu
alami śhrīveṁkaḍeśhu ḍanniḍānu nannunelĕ
talam̐si yādaninela taḍavevu nīvu