Aayanaaya numdare yamganalaala

ఆయనాయ నుండరే యంగనలాల
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నుండరే యంగనలాల
పాయకు వాని నంతేసి పరచఁగఁగలనా

(॥ఆయ॥)
నిచ్చ నిచ్చ నాతినిపై నేరము లెంచెదాననా
మెచ్చి మెచ్చి వలపుల మెరతుఁగాక
రచ్చవేసి చెలులెల్లా రమణుని నాడేరేమే
విచ్చనవిడి నవెల్లా వినఁగలనా

(॥ఆయ॥)
సారెసారె నాతని జరసేటిదాననా
చేరిచేరి కాఁగిటఁ జేకొందుఁగాక
తారుకాణఁ బతి నెంత తప్పులెంచే రిదియేమే
వూరకే నే నిందుకుఁగా వొడ్డారించఁగలనా

(॥ఆయ॥)
నవ్వి నవ్వి శ్రీవేంకటనాయకుఁ దిట్టేదాననా
తవ్వి తవ్వి రతులెల్లా దాటింతుఁగాక
ఇవ్వల నన్నుఁ గూడెను యీతని సాదించేదేమే
వువ్విళ్లూర మీ బుద్దుల కొడఁబడఁ గలనా

(||pallavi||)
āyanāya nuṁḍare yaṁganalāla
pāyagu vāni naṁtesi parasam̐gam̐galanā

(||āya||)
nichcha nichcha nādinibai neramu lĕṁchĕdānanā
mĕchchi mĕchchi valabula mĕradum̐gāga
rachchavesi sĕlulĕllā ramaṇuni nāḍereme
vichchanaviḍi navĕllā vinam̐galanā

(||āya||)
sārĕsārĕ nādani jaraseḍidānanā
seriseri kām̐giḍam̐ jegŏṁdum̐gāga
tārugāṇam̐ badi nĕṁta tappulĕṁche ridiyeme
vūrage ne niṁdugum̐gā vŏḍḍāriṁcham̐galanā

(||āya||)
navvi navvi śhrīveṁkaḍanāyagum̐ diṭṭedānanā
tavvi tavvi radulĕllā dāḍiṁtum̐gāga
ivvala nannum̐ gūḍĕnu yīdani sādiṁchedeme
vuvviḽlūra mī buddula kŏḍam̐baḍam̐ galanā