ఆయనాయ నూరకుండు ఆసోదమా నాకు
(॥పల్లవి॥)
ఆయనాయ నూరకుండు ఆసోదమా నాకు
ఆయమై నీ సేసపాలు అఱచేత నున్నవి
(॥ఆయ॥)
అంతేసి నాతో నీవు ఆనవెట్టుకోనేలయ్య
దొంతిఁ బెట్టుకుందాన నీతొల్లిటిబాస
వింతగా వేరె నాకు విడె మియ్యవలెనా
పొంత నీతమ్ముల మిదె పుక్కిటిలో నున్నది
(॥ఆయ॥)
వెడ్డువెట్టి యింత నన్ను వేఁడుకొననేలయ్య
దొడ్డిఁ బెట్టుకుందాన నీతొంటి మొక్కులు
వొడ్డుకోఁగా నప్పటిం బూవుల వేయవలెనా
వొడ్డిననీ కొప్పు విరు లోడి నిండి వున్నవి
(॥ఆయ॥)
ఆసచూపి జవ్వాదివం కిట్టె నాకీనేలయ్య
దోసిటఁ బట్టుకుందాన తొంటికానికె
వాసి నలమేల్మంగను వడి శ్రీవేంకటేశుఁడ-
వీసుదీరఁ గూడితివి యింతబలు వున్నదా
(||pallavi||)
āyanāya nūraguṁḍu āsodamā nāgu
āyamai nī sesabālu aṟaseda nunnavi
(||āya||)
aṁtesi nādo nīvu ānavĕṭṭugonelayya
dŏṁtim̐ bĕṭṭuguṁdāna nīdŏlliḍibāsa
viṁtagā verĕ nāgu viḍĕ miyyavalĕnā
pŏṁta nīdammula midĕ pukkiḍilo nunnadi
(||āya||)
vĕḍḍuvĕṭṭi yiṁta nannu vem̐ḍugŏnanelayya
dŏḍḍim̐ bĕṭṭuguṁdāna nīdŏṁṭi mŏkkulu
vŏḍḍugom̐gā nappaḍiṁ būvula veyavalĕnā
vŏḍḍinanī kŏppu viru loḍi niṁḍi vunnavi
(||āya||)
āsasūbi javvādivaṁ kiṭṭĕ nāgīnelayya
dosiḍam̐ baṭṭuguṁdāna tŏṁṭigānigĕ
vāsi nalamelmaṁganu vaḍi śhrīveṁkaḍeśhum̐ḍa-
vīsudīram̐ gūḍidivi yiṁtabalu vunnadā