Aayanaaya neejaadala kaddaalaadenaa

ఆయనాయ నీజాడల కడ్డాలాడేనా
Language

(॥పల్లవి॥)
ఆయనాయ నీజాడల కడ్డాలాడేనా
రాయడించ కిఁకఁ గాతరాలేల యియ్యెడల

(॥ఆయ॥)
కలికితనాల లేనికత గడియించనేల
కలసినదాఁకా నెక్కడిసటలే
లలి నింత చాలదా నీ లాగరిచేఁతెల్లాఁ గంటి
కల కల నగక ఇక్కడికి రారాదా

(॥ఆయ॥)
జగడా లదేలే నీ చక్కఁదనాలఁ జాటక
యెగ సక్కేలింతటనే హెచ్చె ననేరా
అగడాయఁ గటకటా ఆడానీడా నీ యాస
తెగనాడఁజెల్ల దిఁక తెరదియ్యరాదా

(॥ఆయ॥)
సరసాన సారెసారె చల్లనికాఁకలె
గరగరఁగా తరగరి తనాలా
ఆరసి శ్రీవేంకటేశ అట్టె నన్నేలితివి
కరకరి యేల చక్కటి నంటరాదా

(||pallavi||)
āyanāya nījāḍala kaḍḍālāḍenā
rāyaḍiṁcha kim̐kam̐ gādarālela yiyyĕḍala

(||āya||)
kaligidanāla lenigada gaḍiyiṁchanela
kalasinadām̐kā nĕkkaḍisaḍale
lali niṁta sāladā nī lāgarisem̐tĕllām̐ gaṁṭi
kala kala nagaga ikkaḍigi rārādā

(||āya||)
jagaḍā ladele nī sakkam̐danālam̐ jāḍaga
yĕga sakkeliṁtaḍane hĕchchĕ nanerā
agaḍāyam̐ gaḍagaḍā āḍānīḍā nī yāsa
tĕganāḍam̐jĕlla dim̐ka tĕradiyyarādā

(||āya||)
sarasāna sārĕsārĕ sallanigām̐kalĕ
garagaram̐gā taragari tanālā
ārasi śhrīveṁkaḍeśha aṭṭĕ nannelidivi
karagari yela sakkaḍi naṁṭarādā