ఆయనాయ నీ సుద్దులు అన్నియుఁ గనుఁగొంటిని
(॥పల్లవి॥)
ఆయనాయ నీ సుద్దులు అన్నియుఁ గనుఁగొంటిని
పాయపు మదాన నేల బయలీఁదించేవు
(॥ఆయ॥)
సేవంతి విరుల వేసి చెలికొంగువట్టి తీసి
వావులు చెప్పతా నెంతవడి నవ్వేవు
నీవూ నాపె చుట్టాలవుత నేనది యెఱఁగనా
యివల నాముందర నీవెంత పచారించేవూ
(॥ఆయ॥)
చెక్కు కొనగొర నూఁది చిమ్మి తమ్ముల మొసఁగి
మక్కువ నించి యందు కా మాలటాడేవూ
అక్కరతో నాఁడే మీయడియాలలు చూడనా
యిక్కడ నాకేల నీవు యెమ్మెలు చూపేవూ
(॥ఆయ॥)
కాలుదొక్కి యంతలోనే కాఁగిటను బిగియించి
వేలువట్టుకొని యిట్టె వేఁడుకొనేవు
మేలిమి శ్రీవేంకటేశ మీ గుణాలు వినమా
యేలితివి నన్ను మీలో యింపులుఁ జూపేవూ
(||pallavi||)
āyanāya nī suddulu anniyum̐ ganum̐gŏṁṭini
pāyabu madāna nela bayalīm̐diṁchevu
(||āya||)
sevaṁti virula vesi sĕligŏṁguvaṭṭi tīsi
vāvulu sĕppadā nĕṁtavaḍi navvevu
nīvū nābĕ suṭṭālavuda nenadi yĕṟam̐ganā
yivala nāmuṁdara nīvĕṁta pasāriṁchevū
(||āya||)
sĕkku kŏnagŏra nūm̐di simmi tammula mŏsam̐gi
makkuva niṁchi yaṁdu kā mālaḍāḍevū
akkarado nām̐ḍe mīyaḍiyālalu sūḍanā
yikkaḍa nāgela nīvu yĕmmĕlu sūbevū
(||āya||)
kāludŏkki yaṁtalone kām̐giḍanu bigiyiṁchi
veluvaṭṭugŏni yiṭṭĕ vem̐ḍugŏnevu
melimi śhrīveṁkaḍeśha mī guṇālu vinamā
yelidivi nannu mīlo yiṁpulum̐ jūbevū