ఆయలేవే యేమి చెప్పే వాతనిపొందులు
(॥పల్లవి॥)
ఆయలేవే యేమి చెప్పే వాతనిపొందులు
పాయముల కొలఁదివే పైకొనెడి యాసలు
(॥ఆయ॥)
పిలుపులకొలఁదివే బిగువులు
బలిమి కొలఁదివే పంతాలు
చలము కొలఁదివే సాదింపులు
కలసిన కొలఁదివే కరగులు
(॥ఆయ॥)
చనవుల కొలఁదివే సరసాలు
ననుపు కొలఁదివే నగవులు
వినికి కొలఁదివే విన్నపాలు
తనిసిన కొఁలదివే తమకములు
(॥ఆయ॥)
వేడుక కొలఁదివే వేసాలు
వాడిక కొలఁదివే వలపులు
యీడనె శ్రీవేంకటేశుఁ డెనసె నిన్ను యీ-
కూడిన కొలఁదివే గుఱుతులు
(||pallavi||)
āyaleve yemi sĕppe vādanibŏṁdulu
pāyamula kŏlam̐dive paigŏnĕḍi yāsalu
(||āya||)
pilubulagŏlam̐dive biguvulu
balimi kŏlam̐dive paṁtālu
salamu kŏlam̐dive sādiṁpulu
kalasina kŏlam̐dive karagulu
(||āya||)
sanavula kŏlam̐dive sarasālu
nanubu kŏlam̐dive nagavulu
vinigi kŏlam̐dive vinnabālu
tanisina kŏm̐ladive tamagamulu
(||āya||)
veḍuga kŏlam̐dive vesālu
vāḍiga kŏlam̐dive valabulu
yīḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnu yī-
kūḍina kŏlam̐dive guṟudulu