Aasodagaamdavai yamtidivi mumde

ఆసోదకాఁడవై యంటితివి ముందే
Language

(॥పల్లవి॥)
ఆసోదకాఁడవై యంటితివి ముందే
వేసర కెట్లా వేగిరించేవయ్యా

(॥అసో॥)
మందగొల్లెతలు మాఁటలాడే రదే
యెందరి కుత్తర మిచ్చేవయ్యా
విందులు వెట్టేరు వేవేలు మోవుల
యెందుకని వొగ్గేవేమయ్యా నీవు

(॥ఆసో॥)
నీరాణివాసాలు నీకు మోహించిరి
యేరీతిఁ జనవు లిచ్చేవయ్యా
కోరి యప్పటిని కొంగులు వట్టిరి
మేరతో నెట్ల మెప్పించేవయ్యా

(॥ఆసో॥)
పట్టపుదేవుళ్లు పైకొని రిప్పుడే
యెట్టొడఁబరచే వేమయ్యా
యిట్టె శ్రీవేంకటేశ నన్నేలితి
ఱట్టడి విందుకు దిట్టవయ్యా

(||pallavi||)
āsodagām̐ḍavai yaṁṭidivi muṁde
vesara kĕṭlā vegiriṁchevayyā

(||aso||)
maṁdagŏllĕdalu mām̐ṭalāḍe rade
yĕṁdari kuttara michchevayyā
viṁdulu vĕṭṭeru vevelu movula
yĕṁdugani vŏggevemayyā nīvu

(||āso||)
nīrāṇivāsālu nīgu mohiṁchiri
yerīdim̐ janavu lichchevayyā
kori yappaḍini kŏṁgulu vaṭṭiri
merado nĕṭla mĕppiṁchevayyā

(||āso||)
paṭṭabudevuḽlu paigŏni rippuḍe
yĕṭṭŏḍam̐barase vemayyā
yiṭṭĕ śhrīveṁkaḍeśha nannelidi
ṟaṭṭaḍi viṁdugu diṭṭavayyā