ఆసగించియున్నదాని నలయించనిఁకనేలే
(॥పల్లవి॥)
ఆసగించియున్నదాని నలయించనిఁకనేలే
పాసి వుండలేకుండితే బత్తిసేయవయ్యా
(॥ఆ॥)
మునుకొని యాపె వచ్చి ముందర నిలుచున్నది
ననుపు గలిగితేను నవ్వవయ్యా
వినయముతో నీకు విన్నపాలకు లాచీ
పని గలిగితే మాటపలు కాడవయ్యా
(॥ఆ॥)
గుట్టుతోడ నీపొందులగుఱుతులెల్లాఁ జెప్పీ
చుట్టమైతే నాపెదిక్కు చూడవయ్యా
నెట్టుకొని సారె నిన్ను నేరుపున సొలసీని
అట్టే నీకు నితవైతే నాదరించవయ్యా
(॥ఆ॥)
నియతానఁ జేరిచేరి నీకుఁ బాదాలొత్తవచ్చె
ప్రియమైతే మంచముపైఁ బెట్టుకోవయ్యా
నయాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితి విన్నిటా
క్రియ గలితే నాపెపైఁ గేలు చాఁచవయ్యా
(||pallavi||)
āsagiṁchiyunnadāni nalayiṁchanim̐kanele
pāsi vuṁḍaleguṁḍide battiseyavayyā
(||ā||)
munugŏni yābĕ vachchi muṁdara nilusunnadi
nanubu galigidenu navvavayyā
vinayamudo nīgu vinnabālagu lāsī
pani galigide māḍabalu kāḍavayyā
(||ā||)
guṭṭudoḍa nībŏṁdulaguṟudulĕllām̐ jĕppī
suṭṭamaide nābĕdikku sūḍavayyā
nĕṭṭugŏni sārĕ ninnu nerubuna sŏlasīni
aṭṭe nīgu nidavaide nādariṁchavayyā
(||ā||)
niyadānam̐ jeriseri nīgum̐ bādālŏttavachchĕ
priyamaide maṁchamubaim̐ bĕṭṭugovayyā
nayāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidi vinniḍā
kriya galide nābĕbaim̐ gelu sām̐savayyā