Aasado nannimaamtalu naadidi ninnu

ఆసతో నన్నిమాఁటలు నాడితి నిన్ను
Language

(॥పల్లవి॥)
ఆసతో నన్నిమాఁటలు నాడితి నిన్ను
మూసిన ముత్తెమువలె మొక్కే నే నీకును

(॥ఆస॥)
బత్తితో నాడినమాఁట భావములు గరఁగించు
కొత్తమాఁట వేడుకతోఁ గొసిరింపించు
పొత్తులమాఁట కమ్మటిఁ బూని యడిగింపించు
యిత్తల నామాఁటలు నీకెటువలె నుండెనో

(॥ఆస॥)
లాలనతోడిమాఁట లాచి పెనఁగింపించు
నాలిమాట సెలవుల నవ్వింపించు
మేలుమీఁదిమాఁటలు సమేళములు పెడరేఁచు
యీలీల నామాఁటలు నీ కెటువలె నుండెనో

(॥ఆస॥)
ఇచ్చకమయినమాఁట ఇయ్యకోలుగాఁ జేసు
మచ్చికగలుగుమాఁట మన్నింపించు
అచ్చముగ నన్నేలితి వన్నిటా శ్రీవేంకటేశ
యిచ్చయిన నామాఁటలు నీ కెటువలె నుండెనో

(||pallavi||)
āsado nannimām̐ṭalu nāḍidi ninnu
mūsina muttĕmuvalĕ mŏkke ne nīgunu

(||āsa||)
battido nāḍinamām̐ṭa bhāvamulu garam̐giṁchu
kŏttamām̐ṭa veḍugadom̐ gŏsiriṁpiṁchu
pŏttulamām̐ṭa kammaḍim̐ būni yaḍigiṁpiṁchu
yittala nāmām̐ṭalu nīgĕḍuvalĕ nuṁḍĕno

(||āsa||)
lālanadoḍimām̐ṭa lāsi pĕnam̐giṁpiṁchu
nālimāḍa sĕlavula navviṁpiṁchu
melumīm̐dimām̐ṭalu sameḽamulu pĕḍarem̐su
yīlīla nāmām̐ṭalu nī kĕḍuvalĕ nuṁḍĕno

(||āsa||)
ichchagamayinamām̐ṭa iyyagolugām̐ jesu
machchigagalugumām̐ṭa manniṁpiṁchu
achchamuga nannelidi vanniḍā śhrīveṁkaḍeśha
yichchayina nāmām̐ṭalu nī kĕḍuvalĕ nuṁḍĕno