ఆసపడ్డవారి నింత అలయింతురా
(॥పల్లవి॥)
ఆసపడ్డవారి నింత అలయింతురా
దోసము రాకుండాను కందువ నుండవోయి
(॥ఆస॥)
వన్నెలెల్లాఁ బెట్టుకొని వద్దనే కొలువసేయు -
చున్నది యీపెఁ జూడవోయి నీవు
సన్నలెల్లాఁ జేయుచును సారెకు నేఁకరీ నీకు
మన్నించి వట్టిపరాకు మానవోయి
(॥ఆస॥)
వేడుకతో నీవద్ద విసుపులేక సారెకు
వూడిగాలు సేసీఁ జూడవోయి నీవు
నీడవలెఁ బాయక నీకె తపము సేసీని
జాడతోఁ జిత్తానఁబెట్టి చనవియ్యవోయి
(॥ఆస॥)
అంటిముట్టి సరసములాడీ సారె నీతో
వొంటి యాపెఁ గాఁగిలించవోయి నీవు
ఇంటనే శ్రీవేంకటేశ యే నలమేలు మంగను
జంట నేలితి వాకెతో సరినవ్వవోయి
(||pallavi||)
āsabaḍḍavāri niṁta alayiṁturā
dosamu rāguṁḍānu kaṁduva nuṁḍavoyi
(||āsa||)
vannĕlĕllām̐ bĕṭṭugŏni vaddane kŏluvaseyu -
sunnadi yībĕm̐ jūḍavoyi nīvu
sannalĕllām̐ jeyusunu sārĕgu nem̐karī nīgu
manniṁchi vaṭṭibarāgu mānavoyi
(||āsa||)
veḍugado nīvadda visubulega sārĕgu
vūḍigālu sesīm̐ jūḍavoyi nīvu
nīḍavalĕm̐ bāyaga nīgĕ tabamu sesīni
jāḍadom̐ jittānam̐bĕṭṭi sanaviyyavoyi
(||āsa||)
aṁṭimuṭṭi sarasamulāḍī sārĕ nīdo
vŏṁṭi yābĕm̐ gām̐giliṁchavoyi nīvu
iṁṭane śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu
jaṁṭa nelidi vāgĕdo sarinavvavoyi