Aasabaddabudu raaga alasinappudu vachchi

ఆసపడ్డపుడు రాక అలసినప్పుడు వచ్చి
Language

(॥పల్లవి॥)
ఆసపడ్డపుడు రాక అలసినప్పుడు వచ్చి
వేసరించేవు రతికి వేళలు గానీరా

(॥ఆస॥)
చివ్వనఁ దియ్యకురా చేయివట్టి నీవు నన్ను
పువ్వువంటిదాన నొప్పుల కోపను
ఇవ్వల బానుపుపై నీ కెదురు చూచుకొంటా
పవ్వళించి వుంటిని యే పరాకై వుంటివో

(॥ఆస॥)
కప్పకురా పచ్చడము కాఁగిటిలో నీవు నాకు
కప్పురము వంటిదాన కాఁక కోపను
చెప్పరాని కోరికతో సిగ్గులెల్లాఁ బారవేసి
అప్పటినుండియు నుంటి నాడనేల నుంటివో

(॥ఆస॥)
మిగులాఁ బిసుకకురా మించి నా చన్నులు నీవు
చిగురువంటి దానను చేఁత కోపను
తగిలి శ్రీ వేంకటేశ దక్క నన్నుఁ గూడితివి
అగపడి యుంటిని యేమనుచు నీవుంటివో

(||pallavi||)
āsabaḍḍabuḍu rāga alasinappuḍu vachchi
vesariṁchevu radigi veḽalu gānīrā

(||āsa||)
sivvanam̐ diyyagurā seyivaṭṭi nīvu nannu
puvvuvaṁṭidāna nŏppula kobanu
ivvala bānububai nī kĕduru sūsugŏṁṭā
pavvaḽiṁchi vuṁṭini ye parāgai vuṁṭivo

(||āsa||)
kappagurā pachchaḍamu kām̐giḍilo nīvu nāgu
kappuramu vaṁṭidāna kām̐ka kobanu
sĕpparāni korigado siggulĕllām̐ bāravesi
appaḍinuṁḍiyu nuṁṭi nāḍanela nuṁṭivo

(||āsa||)
migulām̐ bisugagurā miṁchi nā sannulu nīvu
siguruvaṁṭi dānanu sem̐ta kobanu
tagili śhrī veṁkaḍeśha dakka nannum̐ gūḍidivi
agabaḍi yuṁṭini yemanusu nīvuṁṭivo