Aasa galigide neevoo naadanim jesugoraadaa

ఆస గలిగితే నీవూ నాతనిఁ జేసుకోరాదా
Language

(॥పల్లవి॥)
ఆస గలిగితే నీవూ నాతనిఁ జేసుకోరాదా
రేసు వుట్టి వలపేల రేఁచుకొనేవే

(॥ఆస॥)
యెలమి నెప్పుడు నా యింటనే వున్నాఁడంటా
సొలసి యాతని నేమి చూచేవే నీవు
పలుమారు నామీఁదనే బత్తి సేసీనంటాను
వెలినుండి నీవెంత వెరగందేవే

(॥ఆస॥)
మచ్చిక నాతోడనే మాఁటలాడీనితఁడంటా
కచ్చుపెట్టుక యేల యేఁకారేవే నీవు
ఇచ్చగించి నా విన్నపా లెప్పుడూ వినీనంటా
కొచ్చి కొచ్చి లోలో నేమి గుబ్బతిలేవే

(॥ఆస॥)
మేలువాఁడై నా యిచ్చలో మెలఁగి మన్నించీనంటా
వోలి నిందుకే యట్టు నోరూరేవే నీవు
యీలీల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
వేళ గాచుకొని యేమి వేసాలు సేసేవే

(||pallavi||)
āsa galigide nīvū nādanim̐ jesugorādā
resu vuṭṭi valabela rem̐sugŏneve

(||āsa||)
yĕlami nĕppuḍu nā yiṁṭane vunnām̐ḍaṁṭā
sŏlasi yādani nemi sūseve nīvu
palumāru nāmīm̐dane batti sesīnaṁṭānu
vĕlinuṁḍi nīvĕṁta vĕragaṁdeve

(||āsa||)
machchiga nādoḍane mām̐ṭalāḍīnidam̐ḍaṁṭā
kachchubĕṭṭuga yela yem̐kāreve nīvu
ichchagiṁchi nā vinnabā lĕppuḍū vinīnaṁṭā
kŏchchi kŏchchi lolo nemi gubbadileve

(||āsa||)
meluvām̐ḍai nā yichchalo mĕlam̐gi manniṁchīnaṁṭā
voli niṁduge yaṭṭu norūreve nīvu
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
veḽa gāsugŏni yemi vesālu seseve