ఆఱడిఁబెట్టీ మమ్ము నంతేకాదా
(॥పల్లవి॥)
ఆఱడిఁబెట్టీ మమ్ము నంతేకాదా
జాఱకున్నా మొక్కవచ్చీ సట లింతేకాదా
(॥ఆఱ॥)
అప్పసము వేగుదాఁకా నాకు మడిచి ఇచ్చితిఁ
నప్పటి నన్నుఁ బిలిచీ నంతేకాదా
పిప్పిగాఁ దనపాదాలే పిసికితి నిందాఁకాఁ
జెప్పకవచ్చితిననీఁ జెప్పఁ గొత్తగాదా
(॥ఆఱ॥)
జాముదాఁకాఁ దనకు వెంజామరము వేసితి
నేమి సేయుమనీ నన్ను నింతేకాదా
దోమటినవ్వులు దనతోనే మారు నవ్వితి
యేమో పరాకైతిననీ నిది వింతగాదా
(॥ఆఱ॥)
చేయారఁ బెనఁగితి చెరఁగు నన్నుఁ బట్టఁగా
ఆయము లంటీ గోర నంతేకాదా
యీయెడ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె
వేయిటికి నానవెట్టీ వేసా లింతేకాదా
(||pallavi||)
āṟaḍim̐bĕṭṭī mammu naṁtegādā
jāṟagunnā mŏkkavachchī saḍa liṁtegādā
(||āṟa||)
appasamu vegudām̐kā nāgu maḍisi ichchidim̐
nappaḍi nannum̐ bilisī naṁtegādā
pippigām̐ danabādāle pisigidi niṁdām̐kām̐
jĕppagavachchidinanīm̐ jĕppam̐ gŏttagādā
(||āṟa||)
jāmudām̐kām̐ danagu vĕṁjāmaramu vesidi
nemi seyumanī nannu niṁtegādā
domaḍinavvulu danadone māru navvidi
yemo parāgaidinanī nidi viṁtagādā
(||āṟa||)
seyāram̐ bĕnam̐gidi sĕram̐gu nannum̐ baṭṭam̐gā
āyamu laṁṭī gora naṁtegādā
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
veyiḍigi nānavĕṭṭī vesā liṁtegādā