పల్లవి:
ఆనందమోహనా ఖగరాజవాహనా
ఆనందమోహనా..
అవతార లీలావిలాసా.. లోకేశా
అవతార లీలావిలాసా.. లోకేశా
ఆనందమోహనా...
చరణం 1:
దరిచేరు వారిని కరుణించు దైవరాయ
శరణంటినయ్యా స్వామీ వరమీయవయ్యా
చిరునవ్వు దేవర... చిరునవ్వు దేవర...
ఆనందమోహనా...
చరణం 2:
అందరినీ ఒక ఆటాడించుట నీకు వేడుక
నిను కొనియాడుట మాకు వేడుక
కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయా...
కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయా తోయజ నయనా
ఆనందమోహన ఖగరాజవాహన
ఆనందమోహనా..
చరణం 3:
పాలకడలిలో పాప పానుపున
సిరుల జవరాలు సరసను నిలువగ
సరసాలలో మైమరచే మీ పరవశమే...
సరసాలలో మైమరచే మీ పరవశమే దీవెన కావలె
ఆనందమోహనా ఖగరాజవాహనా
ఆనందమోహనా..
pallavi:
ānaṁdamohanā khagarājavāhanā
ānaṁdamohanā..
avadāra līlāvilāsā.. logeśhā
avadāra līlāvilāsā.. logeśhā
ānaṁdamohanā...
saraṇaṁ 1:
dariseru vārini karuṇiṁchu daivarāya
śharaṇaṁṭinayyā svāmī varamīyavayyā
sirunavvu devara... sirunavvu devara...
ānaṁdamohanā...
saraṇaṁ 2:
aṁdarinī ŏga āḍāḍiṁchuḍa nīgu veḍuga
ninu kŏniyāḍuḍa māgu veḍuga
korina koriga saphalamugā sedoḍu kāvayā...
korina koriga saphalamugā sedoḍu kāvayā toyaja nayanā
ānaṁdamohana khagarājavāhana
ānaṁdamohanā..
saraṇaṁ 3:
pālagaḍalilo pāba pānubuna
sirula javarālu sarasanu niluvaga
sarasālalo maimarase mī paravaśhame...
sarasālalo maimarase mī paravaśhame dīvĕna kāvalĕ
ānaṁdamohanā khagarājavāhanā
ānaṁdamohanā..