ఆనలీవయ్యా నాకు నన్నియు వినేఁగాని
(॥పల్లవి॥)
ఆనలీవయ్యా నాకు నన్నియు వినేఁగాని
మోనముతో సిగ్గువడి మొక్కక వుందానను
(॥ఆన॥)
చెలులచే విన్నపము సేయింపించిన మాటలు
తలఁగ కెప్పుడు నీచిత్తాన నున్నవా
వలపురొమ్ము లబంటి వాసులు యీఁతలబంటి
పలుకఁగ సిగ్గువడి భ్రమతో నుందానను
(॥ఆన॥)
కానుకగా నీకంపినకందువై నగురుతులు
తానకమై బండారాన దాఁచివున్నవా
నానెను జవ్వనమెల్లా నవ్వులు మొలకలెత్తె
పూని యంట సిగ్గువడి పొంచుకవుందానను
(॥ఆన॥)
ఇంపులసన్నలనే యెచ్చరించినచేఁతలు
ముంపులై యిప్పుడు నీమోవి నున్నవా
నింపుల శ్రీవేంకటేశ నీమోవినే మరుముద్ర
గుంపు నిన్నుఁగూడి సిగ్గు గుఱుతై వుందానను
(||pallavi||)
ānalīvayyā nāgu nanniyu vinem̐gāni
monamudo sigguvaḍi mŏkkaga vuṁdānanu
(||āna||)
sĕlulase vinnabamu seyiṁpiṁchina māḍalu
talam̐ga kĕppuḍu nīsittāna nunnavā
valaburŏmmu labaṁṭi vāsulu yīm̐talabaṁṭi
palugam̐ga sigguvaḍi bhramado nuṁdānanu
(||āna||)
kānugagā nīgaṁpinagaṁduvai nagurudulu
tānagamai baṁḍārāna dām̐sivunnavā
nānĕnu javvanamĕllā navvulu mŏlagalĕttĕ
pūni yaṁṭa sigguvaḍi pŏṁchugavuṁdānanu
(||āna||)
iṁpulasannalane yĕchchariṁchinasem̐talu
muṁpulai yippuḍu nīmovi nunnavā
niṁpula śhrīveṁkaḍeśha nīmovine marumudra
guṁpu ninnum̐gūḍi siggu guṟudai vuṁdānanu